అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్
బాపట్ల: డీఎంఎఫ్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ఇంజినీరింగ్ అధికారులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో గురువారం స్థానిక కలెక్టరేట్‌లో ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలో రూ.54.80 కోట్లు ఉండగా, 42 పనులకు అధికారికంగా ఆమోదం లభించిందన్నారు. ఇప్పటివరకు రూ.6.62 కోట్లతో 11 పనులు పూర్తి చేశామన్నారు. మిగిలిన 31 పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. మిగిలిన పనులన్నీ త్వరగా టెండర్లు పూర్తిచేసి, పనులు ప్రారంభించాలన్నారు.
రబీ సీజనుకు సరిపడా యూరియా
రబీ సీజనుకు సరిపడా యూరియా జిల్లాలో రైతులకు అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాబోయే 21 రోజులకు 8,017 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉన్నందున రైతులు ఆందోళన చెందవద్దన్నారు. 45 కిలోల యూరియా బస్తాకు ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.266.50.మాత్రమేనని, ఎక్కువ ధరకు విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.


