కడలి వెంట కాసుల వేట | - | Sakshi
Sakshi News home page

కడలి వెంట కాసుల వేట

Feb 6 2026 7:37 AM | Updated on Feb 6 2026 7:37 AM

కడలి వెంట కాసుల వేట

కడలి వెంట కాసుల వేట

కడలి వెంట కాసుల వేట

విక్రయించే స్థలంలో ప్రభుత్వ భూమి ఉందా..?

తీరానికి అడ్డుకట్ట వేసి.. కబ్జా చేసేందుకు సన్నాహాలు రోడ్డు వేస్తాం.. జెట్జీ నిర్మాణం చేస్తామని మత్స్యకారులకు ఆశలు చీరాల బడా బాబు బండారం బట్టబయలు సుమారు 100 ఎకరాల పొడవున సముద్ర ప్రాంతం కబ్జాకు ప్రణాళిక మంత్రి లోకేష్‌ మనుషులు, బడా బాబుల మధ్య కొనుగోలు ఒప్పందం మరో రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకునే విధంగా ఏర్పాట్లు గతంలో ఈపురుపాలెం మురుగు కాలువ సముద్రపు వాలును పూడ్చిన మరో ఘనుడు దాన్ని ఆదర్శంగా పొట్టిసుబ్బయ్యపాలెం వద్ద బడాబాబు అడుగులు

వాలుకు అడ్డుకట్ట వేస్తే ఎవరికి లాభం?

మత్స్యకారులు ఆందోళనకు దిగకుండా...

మత్స్యకారుల నుంచి ఆందోళనలు రాకుండా ముందస్తుగా వారికి చీరాల బడాబాబు పలు హామీలు ఇచ్చినట్లు తెలిసింది. అందులో భాగంగా గ్రామం నుంచి సముద్రపు క్రీకు వరకు రోడ్డు వేస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఇక మురుగుకాలువ వద్ద జెట్టీ నిర్మాణం జరుగుతుందని కూడా నమ్మబలికినట్లు మత్స్యకారులు సంభాషించుకుంటున్నారు. అలానే గ్రామ ఉమ్మడి అవసరాలకు కూడా కొంత మొత్తం చెల్లించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆ ప్రాంతంలో జెట్టీ ఏర్పాటుకు సంబంఽధించి మత్స్యశాఖ పరంగా ఎలాంటి ప్రతిపాదనలు లేకపోవటం గమనార్హం.

అధికారులు ఏం చేస్తున్నారో!

అధికారులకు తెలియకుండా ఏ అంశానికి సంబంధించి కూడా సంబంధీకులు అడుగులు వేయరనేది ఈ ప్రాంత నానుడి. ముందస్తుగా సమాచారం తెలిసినా మిన్నకుంటారు. ఫిర్యాదులు అందినా పరిశీలిస్తామంటారు. అందుకు వారిని తగిన రీతిలో సంతృప్తి పరుస్తారనేది బహిరంగ రహస్యమంటున్నారు. ఈ క్రమంలో అక్రమార్కులు తమ పనిని పూర్తి చేసుకుంటారు. కొద్ది రోజులు పాలపొంగు లాంటి ఆందోళనలు, వాటిపై రాజకీయ, అధికార అండ అనే నీళ్లతో ఆ ఆందోళనల పొంగును చల్లబరుస్తారు. క్రమేణా ప్రజలు ఆ విషయాలను మర్చిపోతారు. అంతిమంగా భావి తరాలకు అందాల్సిన సహజ వనరులు కనుమరుగవుతున్నాయి. ఈ నేపథ్యంలో పారదర్శకత, దార్శనికత అనే పెద్ద, పెద్ద మాటలను పదే,పదే ఉపయోగించే చంద్రబాబు దృష్టికి ఇలాంటి అంశాలు వెళ్లవా అని ప్రజలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అంతిమంగా ఏం నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే.

సముద్రంలో వాలు కలిసే చోట అడ్డుకట్ట వేస్తే, సముద్రం వెంటే సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో తీరప్రాంతం ఖాళీగా ఉంటుంది. దీన్ని ప్రస్తుతం ఎవరైతే కొనుగోలు, విక్రయాలు జరుపుకుంటున్నారో వారు ఆ 50 ఎకరాల ప్రదేశాన్ని కూడా తమ స్థలంలో కలుపుకునేందుకు (కబ్జా) అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్‌ మనుషులుగా గుర్తింపు పొందిన వ్యక్తులు రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం విక్రయించే భూమిలో చీరాల బడాబాబు గతంలో కొంత ప్రభుత్వ భూమిని కూడా కలుపుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకు సంబంధించి సంబంధిత అధికారులకు పెద్ద మొత్తంలో ఖర్చు చేసి క్రమబద్ధీకరించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. పూర్వ రికార్డులు పరిశీలిస్తే కొన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని విషయం తెలిసిన వారంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement