వారాహి దేవస్థానంలో కోటి కుంకుమార్చన | - | Sakshi
Sakshi News home page

వారాహి దేవస్థానంలో కోటి కుంకుమార్చన

Feb 6 2026 7:37 AM | Updated on Feb 6 2026 7:37 AM

వారాహ

వారాహి దేవస్థానంలో కోటి కుంకుమార్చన

వారాహి దేవస్థానంలో కోటి కుంకుమార్చన 450 బస్తాల రేషన్‌ బియ్యం స్వాధీనం 7,8 తేదీల్లో జాతీయస్థాయి మూట్‌ కోర్టు పోటీలు క్వాంటం వ్యాలీ శంకుస్థాపన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్‌

తెనాలి: కొల్లిపర మండల గ్రామం కుంచవరంలో కొలువైన వారాహి దేవస్థానంలో ఈనెల 11–15 తేదీల్లో జరగనున్న అమ్మవారికి కోటి కుంకుమార్చనలో ప్రజలందరూ పాల్గొనాలని పెనుగొండ పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి (బాలస్వామి) సూచించారు. స్థానిక గంగానమ్మపేటలోని శ్రీవిద్యాపీఠంలో గురువారం కోటి కుంకుమార్చన ఆహ్వాన పత్రికను బాలస్వామీజీ ఆవిష్కరించారు. 11వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 15వ తేదీ మధ్యాహ్నం వరకు కుంకుమార్చన జరుగుతుందని తెలిపారు. ఆహ్వానపత్రిక ఆవిష్కరణలో యోగ గురువు ముద్దాభక్తుని రమణయ్య, వీ–ఫర్నిచర్‌ మాల్‌ అధినేత వక్కలగడ్డ రామమోహనరావు, తుంగల శ్రీనివాస్‌, వారాహి అమ్మవారి దేవస్థానం వ్యవస్థాపకులు తన్నీరు శ్రీనివాసబాబు, సంగీత టీచర్‌ పోతూరి వెంకట ఆదిలక్ష్మి, పెనుగొండ ప్రమీలరాణి, గోపు ప్రభారాణి, కోట లక్ష్మీకుమారి, ముద్దాభక్తుని సామ్రాజ్యం, వరలక్ష్మి, లక్ష్మి, సువర్ధ తదితరులు పాల్గొన్నారు.

భట్టిప్రోలు: భట్టిప్రోలు మండలం గొరిగపూడిలోని ఓ ప్రైవేట్‌ గోడౌన్‌ పై విజిలెన్స్‌, పౌర సరఫరాల అధికారులు బుధవారం రాత్రి దాడి చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన 450 బస్తాల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రేపల్లె సీఎస్‌డీటీ ఓంకార్‌ తెలిపారు. వీటిని అక్రమంగా నిల్వ చేసిన నాగ మల్లేశ్వరరావు, శ్రీనివాసరావులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

గుంటూరుఎడ్యుకేషన్‌: జేకేసీ కళాశాల రోడ్డు లోని జాగర్లమూడి చంద్రమౌళి న్యాయ కళాశాలలో (జేసీ లా) ఈ నెల 7, 8వ తేదీల్లో 5వ జాతీయస్థాయి మూట్‌ కోర్టు పోటీలు నిర్వహిస్తున్నట్లు కళాశాల కార్యదర్శి వేమన కుప్పుస్వామి తెలిపారు. గురువారం జేసీ లా కళాశాలలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సీహెచ్‌ సుధాకర్‌ బాబుతో కలిసి పోటీలకు సంబంధించిన బ్రోచర్‌ ఆవిష్కరించారు. జాతీయస్థాయిలో నిర్వహిస్తున్న మూట్‌ కోర్టు పోటీలకు దేశ వ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల నుంచి 32 కళాశాలల విద్యార్థులు టీంలుగా పాల్గొంటున్నారని తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జి.రామకృష్ణప్రసాద్‌ పోటీలను ప్రారంభించనుండగా, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ సత్యనారాయణమూర్తి ముగింపు కార్యక్రమానికి హాజరవుతున్నట్లు చెప్పారు. పోటీలకు పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తారని తెలిపారు.

తాడికొండ: ఈనెల 7వ తేదీన క్వాంటం వ్యాలీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ ఎ. తమీమ్‌ అన్సారియా గురువారం ఉద్దండరాయునిపాలెం వద్ద జరగనున్న కార్యక్రమ ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఆహ్వానితులు అందరూ మధ్యాహ్నం 1.30 గంటలకు సభాస్థలకిక చేరుకోవాలని, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్‌, పలు అంశాలపై సంబంధిత అధికారులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

వారాహి దేవస్థానంలో కోటి కుంకుమార్చన 1
1/3

వారాహి దేవస్థానంలో కోటి కుంకుమార్చన

వారాహి దేవస్థానంలో కోటి కుంకుమార్చన 2
2/3

వారాహి దేవస్థానంలో కోటి కుంకుమార్చన

వారాహి దేవస్థానంలో కోటి కుంకుమార్చన 3
3/3

వారాహి దేవస్థానంలో కోటి కుంకుమార్చన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement