అసిస్టెంట్ మలేరియా అధికారులుగా పదోన్నతి
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు (ఆర్డీ) కార్యాలయం పరిఽధిలో ఎంపీహెచ్‌ఈఓలుగా పనిచేస్తున్న ఇరువురికి అసిస్టెంట్ మలేరియా అధికారులుగా (ఏఎంఓ) పదోన్నతి లభించింది. గురువారం గుంటూరులోని ఆర్డీ కార్యాలయంలోఉత్తర్యులు అందజేశారు.
ఆరుగురికి హెడ్‌నర్సులుగా పదోన్నతి...
ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో స్టాఫ్‌నర్సులుగా పనిచేస్తున్న ఆరుగురికి హెడ్‌నర్సులుగా పదోన్నతి ఇచ్చారు. వీరిలో గుంటూరు జీజీహెచ్‌కు నలుగురిని, నెల్లూరుకు ఇరువురిని ప్రమోషన్ ఇచ్చి బదిలీ చేశారు. కౌన్సెలింగ్ ప్రక్రియలో ఆర్డీ డాక్టర్ జి.శోభారాణి, డెప్యూటీ డైరక్టర్ బెజ్జం పాల్‌ప్రభాకర్, ఆఫీస్ సూపరింటెండెంట్లు సత్యం, రామకృష్ణ, సీనియర్ అసిస్టెంట్స్ శ్రీకాంత్, గాబ్రియేల్ పాల్గొన్నారు.


