అంతర్జాతీయ షూటింగ్‌ బాల్‌ పోటీల్లో బాపట్ల విద్యార్థికి స్వర్ణం | - | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ షూటింగ్‌ బాల్‌ పోటీల్లో బాపట్ల విద్యార్థికి స్వర్ణం

Feb 6 2026 7:37 AM | Updated on Feb 6 2026 7:37 AM

అంతర్జాతీయ షూటింగ్‌ బాల్‌ పోటీల్లో బాపట్ల విద్యార్థికి

అంతర్జాతీయ షూటింగ్‌ బాల్‌ పోటీల్లో బాపట్ల విద్యార్థికి

కర్లపాలెం: బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం ఏట్రవారిపాలెం గ్రామానికి చెందిన పిట్టు అనూరాధ రెడ్డి ఢిల్లీ జవహర్‌లాల్‌ నెహ్రూ క్రీడా ప్రాంగణంలో జరిగిన అంతర్జాతీయ షూటింగ్‌ బాల్‌ పోటీల్లో పాల్గొని స్వర్ణ పతకం సాధించింది. ఏట్రవారిపాలెం గ్రామానికి చెందిన పిట్టు అనూరాధరెడ్డి గుంటూరు జిల్లా తెనాలి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ డిగ్రీ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. ఈనెల 1వ తేదీ నుంచి 3వరకు జవహర్‌లాల్‌ నెహ్రూ క్రీడా ప్రాంగణంలో అంతర్జాతీయ స్థాయిలో జరిగిన షూటింగ్‌ బాల్‌ పోటీలలో పాల్గొని విజయం సాధించి బంగారు పతకం కై వసం చేసుకుందని బాపట్ల జిల్లా షూటింగ్‌ బాల్‌ కార్యదర్శి నాగలక్ష్మి తెలిపారు. బంగారుపతకం సాధించి గురువారం రాత్రి బాపట్ల వచ్చిన అనూరాధ రెడ్డిని ఏట్రవారిపాలెం గ్రామ సర్పంచ్‌ చీరాల వెంకటలక్ష్మి, శ్రీనివాసరెడ్డి దంపతులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికి శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. బంగారు పతకం సాధించిన అనూరాధ రెడ్డిని పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement