దేవుడితో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు
రేపల్లె: తిరుపతి లడ్డూ ప్రసాదంపై టీడీపీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు పూర్తిగా రాజకీయ స్వలాభం కోసమేనని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి యార్లగడ్డ మదన్ మోహన్ గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు. గురువారం ఆయన రేపల్లెలో విలేకరులతో మాట్లాడారు. తిరుమల వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని సైతం రాజకీయ ప్రయోజనాల కోసం బూటకపు ప్రచారాలు చేసుకోవటం దుర్మార్గమన్నారు. దేవుడితో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు చర్యని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు. విద్యార్థుల ఫీజులు, రైతుల సమస్యలు, నిరుద్యోగం వంటి అసలు సమస్యలపై సమాధానం చెప్పలేక, ప్రజల దృష్టి మళ్లించేందుకు ఈ లడ్డూ వివాదాన్ని లేవనెత్తుతున్నారని విమర్శించారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి
యార్లగడ్డ మదన్‌మోహన్ గౌడ్


