పెనుగంచిప్రోలు: గ్రామంలోని శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ వారిని శుక్రవారం సూర్య కిరణాలు తాకాయి. గర్భాలయంలో ఉదయం అర్చకులు అభిషేకాలు చేస్తున్న సమయంలో మూలవిరాట్‌ను ఉదయం 6.30 నుంచి 6.45 గంటల మధ్యలో సూర్యకిరణాలు తాకాయి. పాదాల నుంచి ముఖం వరకు అమ్మవారిని సూర్య కిరణాలు వెలిగించిన దివ్య తేజస్సును చూసి భక్తులు పరవశులయ్యారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆలయ అధికారులు భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయం చుట్టూ సిమెంట్ రోడ్డుపై నీటితో తడుపుతూ, మ్యాట్లు కూడా ఏర్పాటు చేశారు.
బంగారు గొలుసు కానుక
గామంలోని శ్రీతిరుపతమ్మవారికి శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం పసివేదల గ్రామానికి చెందిన బూరుగుపల్లి శివరామకృష్ణ– వాణి దంపతులు, వారి బంధువు భోగవల్లి దివ్యతేజలు కలిసి 25.950 గ్రాముల బంగారు గొలుసును ఆలయ సూపరింటెండెంట్ రాజు చేతుల మీదుగా అమ్మవారికి కానుకగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు దాతలను అమ్మవారి శేషవస్త్రంతో సత్కరించారు. ప్రసాదాలు అందజేశారు. ఆలయ ఉత్సవ కమిటీ మాజీ సభ్యుడు చుంచు రమేష్‌బాబు, నాయకులు రేగండ్ల రవికుమార్ పాల్గొన్నారు.


