హత్యకేసు నిందితులను నడిరోడ్డుపై నడిపించిన పోలీసులు
చీరాల: ఘోరమైన నేరాలకు పాల్పడేవారిని ఉపేక్షేంచేది లేదని వన్‌టౌన్ సీఐ ఎస్.సుబ్బారావు హెచ్చరించారు. చీరాల్లో ఇటీవల సంచలనం కలిగించిన యువకుడు కొండే త్రినాథ్ హత్య కేసులో ఐదుగురు నిందితులను వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిందితులను బుధవారం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ నుంచి ఏరియా వైద్యశాల వరకు రోడ్డుపై నడిపించి ప్రజలకు హెచ్చరికగా చూపించారు. ఇటువంటి ఘోరమైన నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేవారిపై చట్టపరంగా శిక్షలు తప్పవని తెలిపారు.


