బాబు దారుణ హామీ! | - | Sakshi
Sakshi News home page

బాబు దారుణ హామీ!

Feb 12 2026 7:26 AM | Updated on Feb 12 2026 7:26 AM

బాబు

బాబు దారుణ హామీ!

బాబు దారుణ హామీ!

ఏడాదిగా రుణాల కోసం బీసీ, ఈబీసీల ఎదురుచూపు టీడీపీ నేతలు చెప్పిన వారికే జాబితాలో చోటు మరోసారి ప్రజలను ముంచేసిన చంద్రబాబు సర్కార్‌

ప్రభుత్వం రాయితీ మొత్తం ఇవ్వలేదు

ముఖ్యనేత ఆమోదం ఉంటేనే రుణాలు..

పేద, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం రుణాలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు సర్కార్‌ వారిని నిండా ముంచేసింది. గద్దెనెక్కి రెండేళ్లు కావస్తున్నా నేటికీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. బీసీ, ఈబీసీల కోసం కార్పొరేషన్‌ల ద్వారా విడుదల చేసిన రాయితీ రుణాలను టీడీపీ నేతలు చెప్పిన వారికి ఇవ్వడానికి నిర్ణయించారు. అవీ ఇంకా మంజూరు కాలేదు. ఇక అర్హులకు రుణాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు.

చీరాల టౌన్‌: కేవలం టీడీపీ నేతలు చెప్పిన వారికే రుణాలను మంజూరు చేసేలా తుది జాబితాలను బ్యాంకులకు పంపారు. వారిలోనూ ఒక్కరికీ కూడా రుణాలను అందించలేకపోయారు. ఫలితంగా నిరుద్యోగులకు జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం పలు కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీపై అందించే రుణాలు దక్కక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సబ్సిడీ రుణం వస్తే చిన్న వ్యాపారం ప్రారంభించుకుని కుటుంబాన్ని పోషించుకుందామని ఆశించిన వారి ఆశలు చంద్రబాబు సర్కార్‌ వైఖరితో నీరుగారిపోయాయి. అధికారుల అలసత్వం, టీడీపీ నేతల వైఖరితో వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలను లబ్ధిదారులకు అందించేందుకు కమిటీకి కన్వీనర్‌గా ఎంపీడీఓ, సభ్యులుగా ఈఓఆర్డీ, పలు బ్యాంకుల మేనేజర్లను నియమించారు. స్క్రీనింగ్‌ కమిటీని మొక్కుబడిగా ఏర్పాటు చేశారు. ముఖ్యనేత ఆమోదం పొందిన వారికే రుణాలకు అర్హులను నిర్ధారించారు. ఎంపీడీఓ కార్యాలయానికి టీడీపీ నాయకులు వచ్చి నేరుగా తమవారికి రుణాలు ఖరారయ్యాయో.. లేదో.. అని జాబితాలను చూసుకున్నారు. అర్హులను గుర్తించి వారి వివరాలను బ్యాంకర్లకు అందించడం అధికారుల విధి. ఏడాది క్రితం చీరాల మండల పరిషత్‌ కార్యాలయంలో ఇంటర్వ్యూలను నిర్వహించారు. అధికారులు మాత్రం రుణాలకు అర్జీలు దాఖలు చేసి ఎదురుచూస్తున్న లబ్ధిదారుల వివరాలను బ్యాంకులకు కాకుండా ముందుగానే ముఖ్య నేతకే అందించారు. ఆ నేత ఎంపిక చేసిన వారికే రుణాలు అందించేలా హుకుం జారీ చేయగానే మండల పరిషత్‌ అధికారులు ఆదేశాలను పాటించారు.

612 మంది అభ్యర్థులు..

చీరాల మండలానికి ప్రభుత్వం చీరాల బీసీ కార్పొరేషన్‌, ఈబీసీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కల్పించేందుకు మండలానికి 90 యూనిట్లు మాత్రమే కేటాయించారు. దరఖాస్తులు మాత్రం 621 మంది అభ్యర్థులు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరి బ్యాంకు సిబిల్‌ రేటు, ధ్రువీకరణ పత్రాలను బ్యాంకు మేనేజర్ల సమక్షంలో మండల పరిషత్‌ అధికారులు విచారణ చేపట్టారు. మండలానికి కేటాయించిన 90 యూనిట్లు బీసీ, ఈబీసీ సబ్సిడీ రుణాలకు రూ.1.69 కోట్లు బ్యాంకు మేనేజర్లు రుణాలను అందించనున్నారు. ఎంపిక ఇంటర్వ్యూలు నిర్వహించగా 612 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు.

మిగిలిన పార్టీల నేతలకూ మొండిచేయి..

టీడీపీ అధికారంలోకి రావడానికి ముఖ్యపాత్ర పోషించిన జనసేన, బీజేపీ నాయకులకు చీరాల్లో సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయా పార్టీల నేతలు ఇచ్చిన జాబితాలోని వారికి సబ్సిడీ రుణాలు ఇవ్వకపోవడమే అందుకు నిదర్శనం. గత ఎన్నికల సమయంలో వేరే పార్టీకి పనిచేసి ప్రస్తుతం అధికార పార్టీ పంచన చేరిన మండలంలోని కొందరు నేతలు అంతా తామే అన్నట్లు రుణాల పంపిణీలో చక్రం తిప్పడాన్ని కూటమి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.

వారి ఆశలు అడియాశలేనా..?

చేనేతలు, రోజువారీ కూలీలు, చదువుకుని ఖాళీగా ఉన్న నిరుద్యోగులకు చేయూతనిచ్చే రుణాల ఎంపికలో టీడీపీ నేతలకే ప్రాధాన్యం ఇవ్వడంతో అధికారులు, టీడీపీ నేతల తీరుపై ప్రజలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. నియోజకవర్గ టీడీపీ ముఖ్యనేతలు సిఫార్సు చేసిన వారికి మాత్రమే రుణాలు కేటాయించడంతో గ్రామాల్లోని అర్హులు మాత్రం బాహాటంగా మండిపడుతున్నారు. రుణాల కోసం ఎదురుచూపులు చూస్తున్న లబ్ధిదారుల ఆశలపై చంద్రబాబు సర్కార్‌ నీళ్లు చల్లింది.

కార్పొరేషన్ల సబ్సిడీ రుణాలకు సంబంధించి ఇంటర్వ్యూలను పూర్తి చేశాం. ఎంపిక కమిటీ జాబితాను ఆయా బ్యాంకులకు పంపించాం. సిబిల్‌ స్కోరు ప్రకారం రుణాలు అందిస్తాం. బ్యాంకులు నిర్ధారించిన నమ్మకమైన వ్యక్తులకే రుణాలు లభిస్తాయి. ప్రభుత్వం సబ్సిడీ నగదును బ్యాంకులకు కేటాయించకపోవడంతోనే కార్పొరేషన్‌ రుణాలు ఇవ్వలేపోయారు. మండలంలో బీసీల్లో 80 మందిని, ఈబీసీల్లో 12 మందిని అర్హులుగా నిర్ధారించారు.

– ఎల్‌.విజయ, ఎంపీడీఓ, చీరాల

కార్పొరేషన్‌ రుణాలన్నీ అర్హులకు కాకుండా కేవలం టీడీపీ నేతలు సిఫార్సు చేసిన వారికే మంజూరు అవుతున్నాయని చెబుతున్నారు. అధికారులు మాత్రం ముఖ్యనేత సిఫార్సుతో కేవలం టీడీపీ నాయకులు సూచించిన వారికే ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వ నిబంధనలకు తిలోదకాలు వదులుతున్నారు. రుణాల ఎంపికకు సంబంధించి తుది జాబితాలను సైతం జిల్లా కార్పొరేషన్‌ కార్యాలయాల కంటే ముందుగా టీడీపీ నేతలకు చూపించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

బాబు దారుణ హామీ!1
1/1

బాబు దారుణ హామీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement