అస్తవ్యస్తంగా శ్మశానవాటిక | - | Sakshi
Sakshi News home page

అస్తవ్యస్తంగా శ్మశానవాటిక

Feb 8 2026 4:26 AM | Updated on Feb 8 2026 4:26 AM

అస్తవ్యస్తంగా శ్మశానవాటిక

అస్తవ్యస్తంగా శ్మశానవాటిక

అస్తవ్యస్తంగా శ్మశానవాటిక

చీరాలలోని కారంచేడు రోడ్డులో గల హిందూ శ్మశానవాటిక సుమారు 13 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో ఉంది. అయితే మృతదేహాలను ఖననం చేసేందుకు, దహనసంస్కారాలు నిర్వహించేందుకు శ్మశానవాటికలో పరిస్థితులు అనుకూలంగా లేవు. ఒకవైపు ఏపుగా పెరిగిన చిల్లచెట్లు, ముళ్లపొదలు పెరిగిపోవడంతోపాటు పల్లంగా ఉన్న మరి కొంత స్థలంలో మురుగు నిలిచి తటాకాన్ని తలపిస్తోంది. ఈ పరిస్థితుల్లో దహన వాటిక అవసరం అందరినీ ఆలోచింపజేస్తోంది. దహన యంత్రం అందుబాటులో ఉంటే పేద, మధ్య తరగతి ప్రజలకు డబ్బు ఆదా కావడంతోపాటు ఎక్కువ సమయం అక్కడ పడిగాపులు కాసే సమస్య ఉండదని చీరాల వాసులు అభిప్రాయపడుతున్నారు. చివరి మజిలీలో ఎదురవుతున్న తిప్పలను తప్పించాలని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement