ప్రభల భక్తికి ప్రతీక | - | Sakshi
Sakshi News home page

ప్రభల భక్తికి ప్రతీక

Feb 11 2026 7:37 AM | Updated on Feb 11 2026 7:37 AM

ప్రభల

ప్రభల భక్తికి ప్రతీక

బుధవారం శ్రీ 11 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 ప్రభల భక్తికి ప్రతీక ఇళ్ల పేర్లతో ప్రభల నిర్మాణం ...

న్యూస్‌రీల్‌

సాగర్‌ నీటిమట్టం వివరాలు

బాపట్ల
బుధవారం శ్రీ 11 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

పురుషోత్తమపట్నంలో

భారీ విద్యుత్‌ ప్రభల నిర్మాణం

ఒకే ప్రాంతం నుంచి 11 ప్రభలు

కోటప్పకొండ తిరునాళ్లకు

సిద్ధమవుతున్న పల్నాడు

భక్తి శ్రద్ధలతో ప్రభలు కట్టి దక్షిణామూర్తిని దర్శిస్తే పుణ్యం దక్కుతుందని ప్రతీతి. తిరునాళ్లకు

ప్రభలను నిర్మించటం మనదైన, అరుదైన సంప్రదాయం. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది. భారీ ప్రభలకు కోటప్పకొండ తిరునాళ్ల పెట్టింది పేరు. మహాశివరాత్రికి రూ.లక్షలు వెచ్చించి ప్రభలు కట్టి చేదుకో...కోటయ్యా...మమ్మాదుకో కోటయ్యా అంటూ దైవ నామస్మరణ చేస్తూ కొండకు వెళ్లటం ఆనవాయితీగా వస్తుంది. – చిలకలూరిపేట

సాధారణంగా ఒక గ్రామం నుంచి ఒకటి లేదా రెండు ప్రభలు నిర్మించటం పరిపాటి. అయితే చిలకలూరిపేట పట్టణ పరిధిలోని పురుషోత్తమపట్నం ప్రభల నిర్మాణానికి పెట్టింది పేరు. ఈ ఒక్కచోట నుంచే 11 ప్రభలు నిర్మాణం చేసుకుంటూ ఉండటం ప్రత్యేకత సంతరించుకుంది. ఇక్కడ ఒకదానికి మించి మరో ప్రభను రూ.లక్షలు వెచ్చించి విద్యుత్‌ దీపాలు అలంకరించి అందంగా తీర్చిదిద్దుతున్నారు.

● మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ ప్రభల నిర్మాణంలో పురుషోత్తమపట్నం వాసులు పూర్తిగా తలమునకలయ్యారు. సుమారు 136 ఏళ్ల కిందట పురుషోత్తమపట్నం నుంచి ఒకే ఒక్క గ్రామ ప్రభను నిర్మించి తిరునాళ్లకు తీసుకువెళ్లేవారని పెద్దలు చెబుతారు. తరువాత కాలంలో క్రమేణ ఇళ్ల పేర్లతో ప్రభలు నిర్మించి తిరునాళ్లకు వెళ్లటం ఆనవాయితీగా మారింది.

● ఇక్కడ గ్రామప్రభతో పాటు విడదల వారి ప్రభ, బైరావారి ప్రభ, తోటపుల్లప్పగారి ప్రభ, చిన్నతోటవారి ప్రభ, యాదవరాజుల ప్రభలు రెండు భారీ విద్యుత్‌ ప్రభలు.

వీటికి తోడు తోట కష్ణమ్మగారి ప్రభ, బ్రహ్మంగారి గుడి వీధి ప్రభ, మండలనేనివారి ప్రభలు రెండుమధ్యస్థమైనవి. ఇందులో ఏడు భారీ విద్యుత్‌ ప్రభలు ఒక్కొక్కటి రూ. 18 లక్షలు నుంచి రూ.20లక్షలు పైబడి వెచ్చించి తీర్చిదిద్దుతున్నారు. లైటింగ్‌ ఏర్పాటుకే ఒక్కో ప్రభకు రూ.14 లక్షలు పై బడి ఖర్చు పెడుతున్నట్లు నిర్వాహకులు తెలుపుతున్నారు.

● తిరునాళ్లకు ముందురోజు ప్రభలను రాతి చక్రాల బండ్లపై క్రేన్ల సహాయంతో యువకులు మోకులు చేతబట్టి భక్తి శ్రద్ధలతో నిలబెట్టే కార్యక్రమం చేపడతారు.

● ప్రభలను నిర్మించటం వాటిని కోటప్పకొండకు తరలించటం ఒక యజ్ఞంలా కొనసాగిస్తారు. ఆర్థిక పరిస్థితులు సహకరించినా, సహకరించకున్నా ప్రతి ఏటా క్రమం తప్పకుండా తమ సంప్రదాయ ప్రభల నిర్మాణానికి ఎలాంటి లోటు తలెత్తకుండా ప్రతి ఒక్కరు భాగస్వాములు అవుతారు.

● తిరునాళ్లకు ముందు రెండు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి తిరునాళ్ల నాటికి కొండవద్దకు చేరుకోవటానికి సిద్ధమవుతారు.

కోటప్పకొండకు తరలివెళుతున్న పురుషోత్తమపట్నం ప్రభలు (ఫైల్‌)

సిద్ధమవుతున్న విడదల వారి ప్రభ

విజయపురిసౌత్‌:నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం మంగళవారం 538.20 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి సాగర్‌కి 20,641 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.

ప్రభల భక్తికి ప్రతీక 1
1/6

ప్రభల భక్తికి ప్రతీక

ప్రభల భక్తికి ప్రతీక 2
2/6

ప్రభల భక్తికి ప్రతీక

ప్రభల భక్తికి ప్రతీక 3
3/6

ప్రభల భక్తికి ప్రతీక

ప్రభల భక్తికి ప్రతీక 4
4/6

ప్రభల భక్తికి ప్రతీక

ప్రభల భక్తికి ప్రతీక 5
5/6

ప్రభల భక్తికి ప్రతీక

ప్రభల భక్తికి ప్రతీక 6
6/6

ప్రభల భక్తికి ప్రతీక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement