ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సభ్యునిగా డాక్టర్ జి.
గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ పాలకవర్గం సభ్యులకు సోమవారం రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఎన్నికలలో గుంటూరు ఐఎంఏ శాఖకు చెందిన డాక్టర్ జి.నందకిషోర్ సభ్యునిగా ఎన్నికయ్యారు. 13 మంది సభ్యుల ఎంపికకు మొత్తం 84 మంది వైద్యులు పోటీపడ్డారు. ఆన్‌లైన్‌లో ఎన్నికలు జరగగా అత్యధిక ఓట్లు సాధించి ఎన్నికై న 13 మందిలో డాక్టర్ నందకిషోర్ ఒకరు. 30 వేల మందికి పైగా వైద్యులు ఈ ఎన్నికలలో పాల్గొన్నారు. గతంలో డాక్టర్ నందకిషోర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐఎంఏ కార్యదర్శిగా, అధ్యక్షునిగా పనిచేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నందకిషోర్ మాట్లాడుతూ సభ్యునిగా వైద్యుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఎన్నిక పట్ల ఐఎంఏ గుంటూరు శాఖ అధ్యక్షుడు డాక్టర్ టి.సేవ కుమార్, కార్యదర్శి డాక్టర్ బి.సాయికృష్ణ, స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ డి.అమర్, పలువురు సీనియర్ వైద్యులు అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికల కు రాష్ట్ర సెకండరీ హెల్త్ డైరెక్టర్ కె.వి.ఎన్. చక్రధర బాబు రిటర్నింగ్ ఆఫీసర్ గా వ్యవహరించారు.


