ఈత పోటీల్లో తండ్రీ కుమారుల సత్తా
రేపల్లె: ఓపెన్ రివర్ స్విమ్మింగ్ పోటీల్లో తండ్రి కొడుకులు తమ ప్రతిభను చాటి పలువురి ప్రశంసలు పొందారు. ఇండియన్ నేవీలో మాస్టర్ చీఫ్ పెట్టి ఆఫీసర్‌గా విశాఖపట్నంలో విధులు నిర్వహిస్తున్న రేపల్లె మండలం ఉప్పూడి గ్రామానికి చెందిన పానుగంటి హరికృష్ణ, ఆయన కుమారుడు పానుగంటి జైతిక్ కార్తికేయ ఇటీవల విజయవాడలో కృష్ణా నది ఒడ్డున నిర్వహించిన స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొన్నారు. 1.5 కిలోమీటర్ల దూరాన్ని పానుగంటి హరికృష్ణ 39 నిమిషాల్లో పూర్తి చేయగా, ఆయన 10 ఏళ్ల కుమారుడు జైతిక్ కార్తికేయ అదే దూరాన్ని కేవలం 30 నిమిషాల్లో పూర్తి చేసి విశేష ప్రతిభ కనబరిచాడు. చిన్న వయస్సులోనే ధైర్యం, పట్టుదలతో ఈ ఘనత సాధించడం ప్రత్యేకంగా నిలిచింది. తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి పోటీలో పాల్గొని అద్భుత ప్రదర్శన కనపరిచి గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. ఉప్పూడి గ్రామస్తులతో పాటు పట్టణానికి చెందిన పలువురు తండ్రి కొడుకులను అభినందించారు.
ఓపెన్ రివర్ స్విమ్‌లో అద్భుత ప్రదర్శన


