పులి వాహనంపై మల్లేశ్వరుడు | - | Sakshi
Sakshi News home page

పులి వాహనంపై మల్లేశ్వరుడు

Feb 11 2026 7:37 AM | Updated on Feb 11 2026 7:37 AM

పులి వాహనంపై మల్లేశ్వరుడు

పులి వాహనంపై మల్లేశ్వరుడు

పులి వాహనంపై మల్లేశ్వరుడు

మంగళగిరి టౌన్‌ : మంగళగిరి పట్టణంలోని గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం స్వామి వారు వ్యాఘ్ర వాహనంపై భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. మహిళల కోలాట ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయంలో భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. వేదపండితులు భక్తులకు ఉత్సవ విశిష్టతను వివరించారు. ఉత్సవ కై ంకర్య పరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన శిందె నారాయణ వ్యవహరించారు. దేవస్థాన ఈ.వో. గోపి ఉత్సవ నిర్వహణను పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement