యూనివర్సిటీ క్రీడాకారుల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

యూనివర్సిటీ క్రీడాకారుల ఎంపిక

Feb 5 2026 7:36 AM | Updated on Feb 5 2026 7:36 AM

యూనివర్సిటీ క్రీడాకారుల ఎంపిక

యూనివర్సిటీ క్రీడాకారుల ఎంపిక

వేటపాలెం: సెయింట్‌ ఆన్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలో రెండు రోజులుగా జరుగుతున్న ఇంటర్‌ యూనివర్సిటీ పవర్‌ లిఫ్టింగ్‌, బెస్ట్‌ ఫిజిక్‌ సెలక్షన్లు బుధవారం ముగిశాయని కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్‌ ఎస్‌.లక్ష్మణరావు తెలిపారు. ఈ సెలక్షన్స్‌లో జేఎన్‌టీయూ పరిధిలోని 25 కళాశాలల్లో చదువుతన్న 175 మంది విద్యార్థులు హాజరయ్యారని ప్రిన్సిపాల్‌ కె.జగదీష్‌బాబు తెలిపారు. సెలక్షన్స్‌లో ఎంపికై న విద్యార్థులు యూనివర్సిటీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. మహిళల కేటగిరీలో 57 కేజీల విభాగంలో పేస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఒంగోలుకు చెందిన ఎం.కావ్య, 69 కేజీల విభాగంలో ఆర్‌వీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ.. చేబ్రోలుకు చెందిన ఎం.తేజశ్విని, 83 కేజీల విభాగంలో పి.వందన.. ఎస్‌వీఈసీ ఉమెన్స్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ భీమవరం, బి.సృజన.. ఐడియా ఇన్‌స్టిట్ట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ.. యునివర్సిటీ టీం కింద ఎంపికై నట్లు తెలిపారు. పురుషుల కేటగిరీలో 83 కేజీల విభాగంలో పి.వివేక్‌ ఆర్‌అండ్‌డీ ఆర్‌హెచ్‌ఎస్‌ మిక్‌ కాలేజ్‌ ఆఫ్‌ టెక్నాలజీ, కంచికచర్ల, పి.భార్గవరామ్‌ ప్రియదర్శిని.. చింతలపూడి యునివర్సిటీ టీంలో ఎంపికై ట్లు వ్యాయామ ఉపాధ్యాయులు జేఎన్‌టీయూకే స్పోర్ట్స్‌ మెంబర్‌ అన్న శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో అక్రిడిటేషన్స్‌ డైరెక్టర్‌ సి.సుబ్బారావు, అడ్మినిస్టేషన్‌ డైరెక్టర్‌ వనా దోరనాగ సాయినాథ్‌, వివిధ విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement