వైభవంగా అరవపల్లి బాలకోటయ్య తిరునాళ్ల | - | Sakshi
Sakshi News home page

వైభవంగా అరవపల్లి బాలకోటయ్య తిరునాళ్ల

Feb 16 2026 7:28 AM | Updated on Feb 16 2026 7:28 AM

వైభవంగా అరవపల్లి బాలకోటయ్య తిరునాళ్ల

వైభవంగా అరవపల్లి బాలకోటయ్య తిరునాళ్ల

వైభవంగా అరవపల్లి బాలకోటయ్య తిరునాళ్ల ● ఆలయ ఆవరణంలో పార్వతీ, పరమేశ్వరులకు విశేష అలంకరణ చేసి విగ్రహాలను నెలకొల్పారు. స్వామివారి లింగాన్ని నెలకొల్పి అభిషేకాలు నిర్వహించారు. ● భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయం వద్ద బారులు తీరారు. మహిళా భక్తులు ఆలయ ఆవరణంలో పొంగళ్ళు పెట్టి స్వామికి నివేదించారు. ఆలయ ధ్వజస్తంభం వద్ద స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి, వెన్నపూసను సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారు. గొల్లబామ పేరంటాళ్ళకు ప్రత్యేక పూజలు చేశారు. ● రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ స్వామివారికి పట్టువస్త్రా సమర్పి్‌ంచి పూజలు చేశారు. – జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్‌ స్వామివారికి పట్టువస్త్రాలు అందజేశారు. ● మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు కుటుంబ సమేతంగా విచ్చేసి పూజా కార్యక్రమాలు చేశారు. – తిరునాళ్ళ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రంగుల రాట్నం, బొమ్మల దుకాణాలు, తినుబండారాల దుకాణాలు జనంతో కిటకిటలాడాయి. పట్టణ సీఐ సాంబశివరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు.

భక్తజన సందోహంతో సందడిగా మారిన ఆలయం

రేపల్లె: హరహర మహదేవ... శంభో శివశంకర అంటూ శివ నామస్మరణతో రేపల్లె నియోజకవర్గంలోని శైవక్షేత్రాలు మార్మోగాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని అరవపల్లి గ్రామంలో వేంచేసియున్న బాలకోటేశ్వరస్వామి తిరునాళ్ళ ఆదివారం వైభవంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే స్వామివారికి సుప్రభాత సేవలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి పట్టు వస్త్రాలు, పువ్వులతో అలం కరించారు.

భక్తులతో కిటకిటలాడిన ఆలయం

తిరునాళ్ళను పురస్కరించుకుని భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. రేపల్లె పరిసర ప్రాంతాలతో పాటు ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల నుంచి వేలాదిగా తరలివచ్చిన అరవపల్లి బాలకోటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement