బాలకోటేశ్వరస్వామి ఆలయానికి విరాళం | - | Sakshi
Sakshi News home page

బాలకోటేశ్వరస్వామి ఆలయానికి విరాళం

Feb 9 2026 7:32 AM | Updated on Feb 9 2026 7:32 AM

బాలకో

బాలకోటేశ్వరస్వామి ఆలయానికి విరాళం

బాలకోటేశ్వరస్వామి ఆలయానికి విరాళం కృష్ణానదిలో పడి వృద్ధుడు మృతి ఫొటోగ్రాఫర్‌ నాగేశ్వరరావుకు ద్రోణాచార్య సేవాపురస్కారం కోలాహ లంగా ‘రెవెన్యూ’ ఎన్నికలు

గోవాడ(వేమూరు): మహాశివరాత్రిని పురస్కరించుకుని గోవాడలోని బాలకోటేశ్వరస్వామి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఘంటా నిర్మలమ్మ దంపతులు రూ.లక్ష విరాళం అందజేసినట్లు దేవస్థానం చైర్మన్‌ రమేష్‌ తెలిపారు. భక్తులకు తాగునీటి సౌకర్యార్థం తెనాలి కుమార్‌ పంప్స్‌ అధినేత సబ్రహ్మణ్యం రూ.70 వేల విలువైన ఆర్‌ఓ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం దాతలు ఆలయంలో పూజలు నిర్వహించారు.

రేపల్లె: ప్రమాదవశాత్తూ కృష్ణాదిలో పడి వృద్ధుడు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాజశేఖర్‌ వివరాల మేరకు... మండలంలోని తుమ్మల పంచాయతీ గాదెవారిపాలేనికి చెందిన గాదె అర్జునరావు (78) ఇటీవల పట్టణంలోని తన కుమార్తె ఇంటికి వచ్చాడు. శనివారం విజయవాడలో బంధువుల ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లే క్రమంలో పెనుమూడి వద్ద కృష్ణానదిలో కాళ్లు కడుకుంటూ ప్రమాదవశాత్తూ ముందుకు పడి నీటిలో మునిగిపోయి మృతి చెందాడన్నారు. మృతుని కుమారుడు శ్రీహరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

తెనాలి: తెనాలి కెమెరా క్లబ్‌కు చెందిన ఫొటోగ్రాఫర్‌, శిక్షకుడు కోకాటి నాగేశ్వరరావు (నాగు) ఇండియన్‌ వెడ్డింగ్‌ ఫొటోగ్రఫీ ఫెస్టివల్‌లో ద్రోణాచార్య సేవా పురస్కారం స్వీకరించారు. హైదరాబాద్‌లోని కేబీఆర్‌ ఫంక్షన్‌హాలులో జరుగుతున్న మూడురోజుల ఫెస్టివల్‌లో ఆదివారం ఈ పురస్కారాన్ని జేఎన్‌ఏఎఫ్‌యూ (ఫొటోగ్రపీ), హైదరాబాద్‌ ప్రిన్సిపాల్‌ ఆనంద్‌, హెచ్‌ఓడీ కమల్‌రాయ్‌ చేతులమీదుగా బహూకరించారు. నాగేశ్వరరావును తెనాలి కెమెరా క్లబ్‌ సభ్యులు, పట్టణానికి చెందిన ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు అభినందించారు.

రెవెన్యూ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడిగా నాగమల్లేశ్వరరావు

నరసరావుపేట: ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ఏపీఆర్‌ఎస్‌ఎ) జిల్లా అధ్యక్షుడిగా పిడుగురాళ్ల తహసీల్దార్‌ కె.నాగమల్లేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నరసరావుపేటలోని ఆర్‌డీఓ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న రెవెన్యూ భవనంలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన నెల్లూరు జిల్లా అధ్యక్షులు పెంచలరెడ్డి పేర్కొన్నారు. అసోసియేట్‌ అధ్యక్షులుగా దాచేపల్లి తహసీల్దార్‌ జి.శ్రీనివాసులు, ఉపాధ్యక్షులుగా కారంపూడి తహసీల్దార్‌ ఆర్‌.వెంకటేశ్వర్లునాయక్‌, నరసరావుపేట తహసీల్దార్‌ కార్యాలయ టైపిస్టు శిరిగురి నాగరాజకుమారి, బొల్లాపల్లి తహసీల్దార్‌ ఏవీ సుధాకర్‌, పల్నాడు జిల్లా కలెక్టరేట్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ షేక్‌ బాజి ఎన్నికయ్యారు. ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా అచ్చంపేట తహసీల్దార్‌ సీహెచ్‌.శ్రీనివాసరావు, కార్యదర్శిగా క్రోసూరు తహసీల్దార్‌ వీవీ.నాగరాజు, సంయుక్త కార్యదర్శులుగా పెరుసుమల నరసయ్య, నరసరావుపేట ఆర్డీఓ కార్యాలయానికి చెందిన నంద్యాల ఆంజనేయులు, వెల్దుర్తి తహసీల్దార్‌ కార్యాలయ టైపిస్టు వి.నాగవల్లి, రెంటచింతల తహసీల్దార్‌ కార్యాలయ ఎంఆర్‌ఐ ఎం.మనమోహన్‌ప్రసాదు, కోశాధికారిగా సత్తెనపల్లి ఆర్డీవో కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ కె.కోటేశ్వరరావు, స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ కార్యదర్శిగా కలెక్టరేట్‌లోని జూనియర్‌ అసిస్టెంట్‌ పి.వీరప్రతాప్‌, ఎగ్జిక్యూటీవ్‌ మెంబర్లుగా గురజాల ఆర్డీఓ కార్యాలయ జూనియర్‌ అసిస్టెంట్‌ వి.వెంకటరెడ్డి, మాచవరం తహసీల్దార్‌ కార్యాలయ టైపిస్టు పి.నరేష్‌ ఎన్నికయ్యారు.

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

రెండోసారి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియచేశారు. రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. వరుసగా రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికై న నాగమల్లేశ్వరరావును ఉన్నతాధికారులు, రెవెన్యూ సిబ్బంది సత్కరించారు. పిడుగురాళ్ల ప్రజలు తమ తహసీల్దార్‌ జిల్లా స్థాయి గుర్తింపు పొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

బాలకోటేశ్వరస్వామి ఆలయానికి విరాళం 1
1/2

బాలకోటేశ్వరస్వామి ఆలయానికి విరాళం

బాలకోటేశ్వరస్వామి ఆలయానికి విరాళం 2
2/2

బాలకోటేశ్వరస్వామి ఆలయానికి విరాళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement