బాపట్ల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అంకమ్మ చౌదరి
బాపట్ల: బాపట్ల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా అంకమ్మ చౌదరిని కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని బాపట్ల క్రికెట్ అసోసియేషన్ సీనియర్ సలహాదారులు గంటా అంజిబాబు తెలిపారు. స్థానిక బాపట్ల క్రికెట్ అసోసియేషన్ కార్యాలయంలో బుధవారం క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాపట్ల క్రికెట్ అసోసియేషన్ గత పాలకవర్గ కమిటీ కాలపరిమితి ముగిసినందున నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందన్నారు. నూతన కమిటీలో ప్రెసిడెంట్ ఎర్ర అంకమ్మ చౌదరి, వైస్ ప్రెసిడెంట్ బీ.జేరామ్ రెడ్డి ,సెక్రటరీ బిల్లా స్టాండ్లీ విమల్ కుమార్, జాయింట్ సెక్రెటరీ ఎలవల నరేష్ ,ట్రెజరర్ అబ్దుల్ కరీం అదేవిధంగా బాపట్ల క్రికెట్ అసోసియేషన్‌కు గౌరవ అధ్యక్షులుగా బందా బాబు, సీహెచ్ రోశయ్యలను ఎన్నుకున్నారు. వీరితోపాటు సభ్యులుగా పఠాన్ రాజేష్, ఎం. శ్రీనివాసరావు ,కొట్ర వెంకటరావు, కొమరోలు శ్రీనివాసరావుని కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్ అంకమ్మ చౌదరి మాట్లాడుతూ బాపట్ల క్రికెట్ అసోసియేషన్ బలోపేతనానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానన్నారు. బాపట్ల జిల్లాలో యువ క్రికెట్ క్రీడాకారుల అభివృద్ధికి కమిటీ సభ్యులందరూ తమ వంతు కృషి చేస్తామని ఆయన తెలిపారు.


