వినుకొండ ఫొటోగ్రాఫర్‌కు ‘సిగ్మా’ అవార్డు
వినుకొండ: పట్టణానికి చెందిన కేసానపల్లి సుబ్బారావు జాతీయ స్థాయిలో వివాహ ఆచారాల కేటగిరిలో సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ అవార్డు అందుకున్నారు. ఇండియన్ వెడ్డింగ్ ఫొటోగ్రఫీ ఫెస్టివల్–2026లో భాగంగా సిగ్మా అకాడమీ ఆఫ్ ఫొటోగ్రఫీ నిర్వహించిన పోటీలలో వెడ్డింగ్ మూమెంట్స్ ఫొటోకు అవార్డు దక్కింది. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన అవార్డు ప్రదానం కార్యక్రమంలో ప్రముఖుల చేతుల మీదుగా సుబ్బారావు అవార్డు అందుకున్నారు. సుబ్బారావును పల్నాడు జిల్లా ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్‌బీకే, వినుకొండ ఫొటోగ్రాఫర్ అసోసియేషన్ సభ్యులు సూర్య, బ్రహ్మం, వెంకటేష్, పెద్దమల్లయ్య, శ్రీకాంత్, సీపీ కృపాకర్, వేణు, నరేంద్ర అభినందించారు.
పిడుగురాళ్ల ఫొటోగ్రాఫర్లకు అవార్డులు
పిడుగురాళ్ల: ిపడుగురాళ్ల పట్టణానికి చెందిన ఫొటోగ్రాఫర్లు అవార్డులు అందుకున్నారు. హైదరాబాద్‌లోని ఈఎంఆర్‌సీ–ఉస్మానియా యూనివర్సిటీ సమర్పణలో ఇండియన్ వెడ్డింగ్ ఫొటోగ్రఫీ ఫెస్టివల్ ఫొటో పరివార్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించినట్లు వారు తెలిపారు. ఈ పరివార్ విశిష్టసేవా పురస్కార వేడుకల్లో పిడుగురాళ్ల పట్టణనికి చెందిన ఫొటోగ్రాఫర్లు సీదా రామరావు, రామిశెట్టి చంద్రశేఖర్‌రావు, రామినేని భరత్‌కుమార్‌లు వెడ్డింగ్ ఫొటోగ్రఫీ, బిజినెస్ ఎక్స్‌లెన్స్ అవార్డును అందుకున్నారు.
వినుకొండ ఫొటోగ్రాఫర్‌కు ‘సిగ్మా’ అవార్డు
వినుకొండ ఫొటోగ్రాఫర్‌కు ‘సిగ్మా’ అవార్డు


