కొనసాగుతున్న వైద్య ప్రదర్శన | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న వైద్య ప్రదర్శన

Feb 9 2026 7:34 AM | Updated on Feb 9 2026 7:34 AM

కొనసాగుతున్న వైద్య ప్రదర్శన

కొనసాగుతున్న వైద్య ప్రదర్శన

కొనసాగుతున్న వైద్య ప్రదర్శన

గుంటూరు మెడికల్‌: గుంటూరు వైద్య కళాశాలలో మెడ్‌ ఫ్యూజన్‌ పేరుతో ఈ నెల 4వ తేదీ నుంచి జరుగుతున్న వైద్య ప్రదర్శన ఆదివారం కూడా కొనసాగింది. డైరెక్టర్‌ ఆఫ్‌ కాలేజియేట్‌ ఎడ్యుకేషన్‌ డాక్టర్‌ నారాయణ భరత్‌ గుప్తా ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. అనాటమీ, జనరల్‌ సర్జరీ సహా పలు విభాగాల ప్రదర్శనను సందర్శించారు. వాటి వివరాలను తమ కుమార్తెకు వివరిస్తూ, చూపించారు. వైద్య విద్యార్థులతో ముచ్చటించారు. తాను ఎంబీబీఎస్‌ చదివే రోజులను గుర్తు చేసుకున్నారు. ఇలాంటి విజ్ఞాన ప్రదర్శనలు ప్రజలకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. అనంతరం ఆయన్ను కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ నాగార్జునకొండ వెంకట సుందరాచారి శాలువాతో సత్కరించారు.

ఒక్కరోజే 4,184 మంది సందర్శన...

ఆదివారం 4,184 మంది ప్రదర్శనను సందర్శించారని ప్రిన్సిపల్‌ తెలిపారు. ముందస్తుగా వెబ్‌సైట్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకుని రావాలని సందర్శకులకు విజ్ఞప్తి చేశారు. కళాశాల వద్ద నేరుగా టికెట్లు తీసుకోవడం వల్ల ఒక్కసారిగా రద్దీ ఏర్పడే అవకాశముందని పేర్కొన్నారు. బుకింగ్‌ ద్వారా సమస్యను నివారించవచ్చని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement