డిగ్రీ ఫలితాల్లో శ్రీమేధ–కెరీర్ డిగ్రీ కళాశాల విద్యార్
గుంటూరు ఎడ్యుకేషన్: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇటీవల ప్రకటించిన డిగ్రీ 3, 5వ సెమిస్టర్ పరీక్ష ఫలితాల్లో శ్రీమేధ – కెరీర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు యూనివర్సిటీ స్థాయిలో టాప్ మార్కులు సాధించారని సంస్థ డైరెక్టర్లు శేషసాయి బాబు, అన్నా నందకిషోర్ తెలిపారు. గురువారం కొత్తపేటలోని కళాశాలలో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ బీకాం జనరల్ తృతీయ సెమిస్టర్ ఫలితాల్లో 600 మార్కులకు ఫాలక్ జైన్ 519 మార్కులు, పి.జైన్ 512, రిద్ది జైన్ 496, చింతపల్లి శ్రీచిన్న మల్లేశ్వరి 490, మొహమ్మద్ ఫర్హానా బేగం 482 మార్కులతోపాటు, బీకాం కంప్యూటర్స్ విభాగంలో 800 మార్కులకు గాను ఆదిత్య 674 మార్కులు, ఓర్సు వెంకటేశ్వర్లు 669, లక్షితా జైన్ 649 మార్కులతో యూనివర్సిటీ టాపర్లుగా నిలిచిచారని తెలిపారు. 5వ సెమిస్టర్ ఫలితాల్లో బీకాం కంప్యూటర్స్ విభాగంలో 850 మార్కులకు గాను బట్టు షారోనికా 726 మార్కులు, షేక్ నగినా 723, షేక్ క్యూబా కౌసిన్ 694, బి.కాం జనరల్ విభాగంలో 650 మార్కులకుగాను శరత్‌చంద్ర 583 మార్కులు, రితిక కుమారి 576, తేజోష్ బొత్రాజైన్ 576, షేక్ సుమయ 553, ఎం. మోక్షిత 547 మార్కులతో యూనివర్సిటీ టాపర్లుగా నిలిచారని తెలిపారు. విద్యార్థులతోపాటు అధ్యాపక, ఆధ్యాపకేతర సిబ్బందిని అభినందించారు.


