బాపట్ల ఫొటోగ్రాఫర్‌కు జాతీయస్థాయి అవార్డు
బాపట్ల టౌన్: బాపట్ల ఫొటోగ్రాఫర్ డాక్టర్ పీవీఎస్ నాగరాజుకు ఫొటోగ్రఫీలో జాతీయ అవార్డు దక్కింది. ఇండియన్ వెడ్డింగ్ ఫొటోగ్రఫీ ఫెస్టివల్ అండ్ ఫొటో ఫైన్ ఎక్స్‌పో–2026, సిగ్మా ఆర్ట్ ఫొటోగ్రఫీ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో బాపట్ల మండలం, ముత్తాయపాలెం గ్రామానికి చెందిన పవన్ క్లాసిక్ ఫొటోగ్రఫీ అధినేత డాక్టర్ పీవీఎస్ నాగరాజు తీసిన వెడ్డింగ్ ఫొటోకు జాతీయస్థాయి అవార్డు లభించింది. అవార్డును ఈనెల 8న హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్ కేబీఆర్ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మరెడ్డి భరద్వాజ, ఫెడరేషన్ ఇండియన్ ఫొటోగ్రఫీ ప్రెసిడెంట్ సీఆర్ సత్యనారాయణ, జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్‌ఆర్ట్స్ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ ఆనంద్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. అవార్డు అందుకున్న పీవీఎస్ నాగరాజును పట్టణ ఫొటోగ్రాఫర్లు అభినందించారు.
బాపట్ల ఫొటోగ్రాఫర్‌కు జాతీయస్థాయి అవార్డు


