నయన మనోహరంగా శ్రీవారి పుష్పయాగం
బాపట్ల: స్థానిక కోన కళాక్షేత్రంలో లలితా త్రిపుర సుందరీ పీఠం ఆధ్వర్యాన సోమవారం సాయంత్రం నయన మనోహరంగా శ్రీవారి పుష్పయాగం సాగింది. పుష్పయాగ శోభాయాత్ర, శ్రీ సీతారామ కోలాట సమాజం వారి కోలాటం, భక్త జన సందోహంతో పురవీధుల్లో వైభవంగా సాగింది. నెమలికంటి హనుమంతరావు సారధ్యంలో ముత్తేవి శ్రీనివాస శశికాంత్ యాగ్నీక పర్యవేక్షణలో రొంపిచర్ల కేశవాచార్యులు, పరాశరం రఘురామ్, గోపాలాచార్యులు, కౌండిన్య, సాయి వెంకట్, ప్రసాద్ స్వామి, విఖనస మూర్తి, మణికంఠ, బండి రాంబాబు, కృష్ణగౌడ్ బాలాజీ, అంజిరెడ్డి, నాళం శ్రీను, సుదర్శన్, రాజు, వేలాదిగా భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ పాల్గొన్నారు.


