గజ వాహనంపై దర్శనమిచ్చిన మల్లేశ్వరుడు | - | Sakshi
Sakshi News home page

గజ వాహనంపై దర్శనమిచ్చిన మల్లేశ్వరుడు

Feb 14 2026 7:53 AM | Updated on Feb 14 2026 7:53 AM

గజ వా

గజ వాహనంపై దర్శనమిచ్చిన మల్లేశ్వరుడు

మంగళగిరి టౌన్‌: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళగిరి పట్టణంలో వేంచేసి ఉన్న గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో ఏడో రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం స్వామి వారు గజ వాహనంపై భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. పురవీధుల్లో నిర్వహించిన ఊరేగింపులో భక్తులు ఆయా కూడళ్లలో స్వామివారిని దర్శించుకుని టెంకాయలు, హారతులు సమర్పించారు. మహిళల కోలాట ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మంగళగిరి పట్టణ శ్రీ పద్మశాలీయ బహుత్తమ సంఘం వారు ఉత్సవ కై ంకర్య పరులుగా వ్యవహరించారు. దేవస్థాన ఈఓ గోపి ఉత్సవ నిర్వహణను పర్యవేక్షించారు. దేవస్థాన ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌ భోగి కోటేశ్వరరావుతోపాటు పలువురు పాలకమండలి సభ్యులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.

గజ వాహనంపై దర్శనమిచ్చిన మల్లేశ్వరుడు 1
1/1

గజ వాహనంపై దర్శనమిచ్చిన మల్లేశ్వరుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement