హాస్టల్ విద్యార్థులకు సరైన భోజనం పెట్టకపోతే చర్యలు
ఫుడ్ కమిషన్ సభ్యులు ఇ.లక్ష్మీరెడ్డి
బాపట్ల: హాస్టల్ విద్యార్థులకు సరైన భోజనం పెట్టకపోతే చర్యలు తప్పవని ఫుడ్ కమిషన్ సభ్యులు ఇ.లక్ష్మీరెడ్డి పేర్కొన్నారు. బాపట్లలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్‌లోని ఆహారపదార్థాలను గురువారం ఆయన పరిశీలించారు. సరైన ఆహారం వడ్డించకపోవటంపై సిబ్బందిపై మండిపడ్డారు. ఇదేవిధంగా ఉంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తొలుత ఎంఎల్‌ఎస్ పాయింట్‌ను తనిఖీ చేశారు. నిల్వలను అడిగి తెలుసుకున్నారు.
పెదపులివర్రు(భట్టిప్రోలు): మహా శివరాత్రి కల్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా వ్యాఘ్రపుర క్షేత్రంగా ప్రసిద్ధి గాంచిన భట్టిప్రోలు మండలం పెదపులివర్రులోని శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత శ్రీ రాజరాజ నరేంద్ర స్వామి వారి కల్యాణ మహోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తొలుత స్వామి వారిని పెండ్లి కుమారుడిని చేశారు. గ్రామానికి చెందిన కొసరాజు శశి కుమార్, సోదరులు దివంగత కొసరాజు అఖిలాండేశ్వరి కుటుంబ సభ్యులు, జువ్వలపాలెంకు చెందిన వేముల పల్లి రాఘవయ్య ఉభయ దాతలు పాల్గొన్నారు. సాయంత్రం ధ్వజారోహణ జరిగింది.


