ముంబై: ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడంతో విసుగు చెందిన ఆందోళనకారులు వినూత్నంగా నిరసన తెలిపారు. అధికారుల మొండి వైఖరికి నిరసనగా ఏకంగా వీధి కుక్కలను పట్టుకెళ్లి ప్రభుత్వ కార్యాలయంలోని అధికారుల టేబుల్‌పైనే వదిలారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మహారాష్ట్రలోని నాసిక్‌లో వీధి కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై బాధితులు ఎన్నోసార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
దీంతో సహనం కోల్పోయిన ప్రతిపక్ష శివసేన విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు విక్రమ్ వినూత్న రీతిలో నిరసనకు దిగారు. ఇందులో భాగంగా నిప్పహాడ్ నగర్ పంచాయతీ ఆఫీస్ చీఫ్ ఆఫీసర్ ధరేజ్ కార్యాలయానికి వెళ్లారు. ఆయన ఆఫీస్ గదిలో ఉండగానే లోపలికి ప్రవేశించి, అధికారుల టేబుళ్లు కుర్చీలపై ఆ కుక్కలను వదిలిపెట్టారు.
అధికారులకు సమస్య తీవ్రతను కళ్లకు కట్టేందుకే తాము ఈ పద్ధతిని ఎంచుకున్నామని ఆందోళనకారులు తెలిపారు. కార్యాలయంలో కుక్కలు తిరుగుతుండటంతో అధికారులు, సిబ్బంది కొద్దిసేపు బెంబేలెత్తిపోయారు. ఈ వినూత్న నిరసన కార్యక్రమం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Nashik - Yuva Sena district chief Vikram Randhave led an aggressive protest against the functioning of the Niphad Nagar Panchayat, drawing attention to the rising stray dog menace in the town. Randhave released four to five stray dogs inside the office of Chief Officer Dhiraj… pic.twitter.com/QhRXxl9BOe
— NextMinute News (@nextminutenews7) September 16, 2026


