వంటగదిలో పని మనిషి కన్నీళ్లు.. తర్వాత ఏం జరిగిందంటే..! | Young Man Celebrates House Help Birthday After Finding Her Crying In Kitchen, Touches Thousands Of Hearts Online | Sakshi
Sakshi News home page

వంటగదిలో పని మనిషి కన్నీళ్లు.. తర్వాత ఏం జరిగిందంటే..!

Apr 4 2026 11:43 AM | Updated on Apr 4 2026 2:02 PM

Man Celebrates House Help Birthday After Finding Her Crying In Kitchen

ఓ భావోద్వేగ క్షణం నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. తన ఇంట్లో పని చేసే మహిళ కోసం ఓ యువకుడు నిర్వహించిన పుట్టినరోజు వేడుక సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కృతార్థ అనే యువకుడు తన ఇంట్లో పనిచేసే జ్యోతిని ఆప్యాయంగా ‘దీదీ’ అని పిలుస్తుంటారు. ఓ రోజు అతను.. జ్యోతి వంటగదిలో కన్నీరుపెట్టుకోవడం గమనించాడు. ఏం జరిగిందంటూ విచారించగా.. ఆమె చెప్పిన మాటలు ఆ యువకుడి గుండెల్ని పిండేశాయి.

 ఇవాళ నా పుట్టినరోజు.. ఒకవేళ నా తల్లి బతికి ఉంటే నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేదంటూ ఆమె వాపోయింది. జ్యోతి చాలా చిన్న వయసులోనే తన తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయింది. అందుకే తన పుట్టినరోజున ఒంటరితనంతో ఆమె అలా భావోద్వేగానికి లోనయ్యింది. ఆమె గతాన్ని మార్చడం సాధ్యం కాదు కానీ.. ఆమె కళ్లలో సంతోషం చూడడానికి కృతార్థ.. తన స్నేహితులతో కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాడు. అందరూ కలిసి ఆమె పుట్టినరోజును సెలబ్రేట్ చేయాలని నిశ్చయించుకున్నారు. వీడియోలో చూపినట్లుగా.. ఆ బృందం ఒక కేక్ ఏర్పాటు చేసి చిన్నపాటి వేడుకను నిర్వహించారు. 

ఈ వేడుక సమయంలో జ్యోతి తన పుట్టినరోజు సందర్భంగా  ఏదైనా ఆర్డర్ చేసుకుని పార్టీ చేసుకోమని.. తన వద్ద ఉన్న 500 రూపాయలను వారికి ఇవ్వబోయింది.. కానీ కృతార్థ, అతని స్నేహితులు ఆ డబ్బును తీసుకోవడానికి నిరాకరించారు.. ప్రేమతో ఆమె పుట్టినరోజును జరిపారు. ‘‘ఈ వీడియోలోని నిరాడంబరత, మానవత్వం వేలాది మంది హృదయాలను తాకింది. ఆమె ముఖంలోని ఆ చిరునవ్వే సమాధానం ఇస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో మనం చూడదగ్గ అత్యుత్తమమైన దృశ్యం ఇది. ఆమె ముఖంలో కనిపిస్తోన్న ఆ ఆనందం వెలకట్టలేనిది’’ అంటూ నెటిజన్లు స్పందించారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement