breaking news
ganapati fest
-
నిమజ్జనం వేళ.. చిరాగ్ పాశ్వాన్ కన్నీరు!
ముంబై: గణపతి నిమజ్జనం భక్తులకు భావోద్వేగంతో కూడిన సందర్భం. గణపయ్యకు వీడ్కోలు పలికే సమయంలో నటుడు, కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) నేత చిరాగ్ పాశ్వాన్ భావోద్వేగానికి గురైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. విగ్రహాన్ని నిమజ్జనానికి తరలిస్తున్న సమయంలో ఆయన కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించారు. Chirag Paswan getting emotional and crying during Ganpati Bappa’s farewell 🥹🙏 https://t.co/WiaRvNVzdg— Tejash (@lord_geopolitic) September 19, 2026గణపతి విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తున్న సమయంలో చిరాగ్ పాశ్వాన్ అక్కడే ఉన్నారు. వీడ్కోలు పలుకుతున్న సమయంలో ఆయన తన భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయినట్లు వీడియోలో కనిపించింది. చుట్టూ ఉన్న భక్తులు నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటుండగా.. చిరాగ్ పాశ్వాన్ కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోను చూసిన కొంతమంది సోషల్ మీడియా యూజర్స్ చిరాగ్ పాశ్వాన్ కన్నీళ్లు నిజమైనవేనా అంటూ ప్రశ్నించారు. మరికొందరు ఆయన నటిస్తున్నారని వ్యాఖ్యానించారు. చిరాగ్ పాశ్వాన్వి ‘నకిలీ కన్నీళ్లు’ అంటూ ఒకరు వ్యాఖ్యానించగా.. మరొకరు ‘గొప్ప నటుడు’ అంటూ వ్యంగ్యంగా స్పందించారు. ఇంకొందరు ఆయన నవ్వుతూ ఏడుస్తున్నట్లు నటిస్తున్నారని, ఇదంతా ఫేక్ అంటూ కామెంట్లు చేశారు.ఇదీ చదవండి: పారిస్ ఒప్పందాన్ని నిలబెట్టాం : ప్రధాని మోదీ -
గాయత్రి యజ్ఞంలో ముస్లిం మహిళ
మానుకోటలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఎస్ఎస్.లోయ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం గణేశ్ గాయత్రి యజ్ఞం నిర్వహించారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని స్థానిక విద్యార్థులు మట్టితో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసి పాఠశాలలో ప్రతిషి్ఠంచి పూజలు చేస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న ముస్లిం మహిళ జహేరా.. గణేశ్ గాయత్రి యజ్ఞంలో పాల్గొని ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని మతాల సారాంశం ఒక్కటేనని.. ప్రజలందరూ సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలని కోరారు. – మహబూబాబాద్ రూరల్


