యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్, గేమింగ్, కామిక్స్(ఏవీజీసీ) రంగాల సమ్మేళనంగా నిర్వహించే వినూత్న సృజనాత్మక వేడుక ‘దేశీ టూన్స్ 2025’కు భాగ్యనగరం వేదిక కానుంది. దేశంలో సృజనాత్మక ఆర్థిక వ్యవస్థకు రూపకల్పన చేస్తున్న అతిపెద్ద వేడుక ఇండియాజాయ్ 2025, ఈ ఏడాది తన 8వ ఎడిషన్‌తో మరింత వైభవంగా రాబోతోంది.
ఇందులో భాగంగా దేశీ టూన్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. చోటా భీమ్ వంటి ప్రముఖ భారతీయ పాత్రలను సృష్టించిన గ్రీన్ గోల్డ్ యానిమేషన్ సంస్థ నిర్వహిస్తున్న ఈ యానిమేషన్ కాన్‌క్లేవ్‌వచ్చేనెల 1న హైదరాబాద్ నగరంలోని హెచ్‌ఐసీసీ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించనుంది.
ఈ ఏడాది ఎడిషన్‌లో భారతీయ సాంస్కృతిక మూలాల నుంచి ప్రేరణ పొందిన కథలను అంతర్జాతీయ ప్రేక్షకుల మనసులను తాకేలా మలుస్తున్న సృజనకారుల విజయగాథలను ప్రదర్శించనున్నారు. మాస్టర్‌క్లాస్‌లు, ప్యానెల్ చర్చలు, ఇంటరాక్టివ్ సెషన్లు.. అన్నీ క్రియేటర్స్, నిర్మాతలు, పరిశ్రమ నిపుణుల కోసం ప్రేరణాత్మక అనుభవంగా ఉండబోతున్నాయి.
గ్లోబల్ ప్లాట్‌ఫామ్..
‘దేశీ టూన్స్’ భారతీయ కథన శక్తికి, సృజనాత్మక ప్రతిభకు ప్రతీకగా నిలుస్తోంది. భారతీయ యానిమేషన్ ప్రపంచానికి వేదికగా ఈ కాన్‌క్లేవ్ కొత్త ప్రతిభను వెలికితీయడంతో పాటు పాలసీ, పెట్టుబడి, సాంకేతికత వంటి రంగాల్లో సమన్వయం సృష్టించడంలో కీలకపాత్ర పోషిస్తోంది.
ఈ వేదిక ద్వారా రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ యానిమేషన్, విజువల్ మీడియా రంగాలకు ఉత్సాహం, అవకాశాలను కల్పించే నిర్ణయాలకు అద్భుత వేదికగా నిలవనుంది. అంతేగాకుండా ‘పవర్ ప్లేయర్స్ ఆఫ్ ఇండియన్ యానిమేషన్’, ‘క్వైట్ స్టోరీస్, పవర్‌ఫుల్ ఇంపాక్ట్’, ‘ది రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ బూస్టింగ్ ఏవీజీసీ సెక్ట్సర్’ చర్చలు జరుగుతాయి.
ఇందులో పాన్ ఇండియా హిట్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ దర్శకుడు నాగ్ అశి్వన్, ‘మహావతార్ నరసింహ’ (2025) దర్శకుడు అశి్వన్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సౌత్ ఆసియా కిడ్స్ కంటెంట్ హెడ్ సాయి అభిõÙక్ వంటి ప్రముఖులు పాల్గొననున్నారు. యానిమేషన్ అభిమానులు, విద్యార్థులు, పరిశ్రమ నిపుణులు తదితరులు ఇందులో భాగం కానున్నారు.
మన కథల గురించి చెప్పుకోవాలి..
ఈ నేపథ్యంలో గ్రీన్ గోల్డ్ యానిమేషన్ వ్యవస్థాపకులు రాజీవ్ చిలకా మాట్లాడుతూ.. భారతీయ కథలు ప్రపంచ వేదికపై వెలుగొందాలి. మన సంస్కృతికి చెందిన నిజమైన కథలు సాంకేతికత, ఊహాశక్తి, క్రియేటివిటీ ద్వారా ప్రపంచాన్ని ఆకట్టుకునేలా మలచవచ్చని తెలిపారు.
ఇండియాజాయ్ ప్రతినిధి మాధవరెడ్డి యతం మాట్లాడుతూ.. దేశీ టూన్స్ భారతీయ సృజనాత్మకతకు ప్రతీక. గ్రీన్ గోల్డ్ భాగస్వామ్యంతో ఇండియాజాయ్ ఆవిష్కరిస్తున్న ఈ వేదిక భారతదేశం కేవలం సృజనాత్మక భాగస్వామి కాకుండా గ్లోబల్ లీడర్‌గా ఎదిగే క్రమాన్ని ప్రదర్శిస్తోందని అన్నారు.
(చదవండి: రుచులదాత 'సుషీ'భవ..! భోజనప్రియులు ఇష్టపడే క్రేజీ వంటకం)


