కార్మికులకు ఆరోగ్య భద్రత
సంగారెడ్డి: కార్మికుల ఆరోగ్య భద్రత మున్సిపాలిటీ ప్రథమ లక్ష్యమని టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలారెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. ఈ సందర్భంగా సోమవారం స్థానిక మున్సిపాలిటీలో ఐదు కొత్త ట్రాక్టర్లు ప్రారంభించడంతో పాటు సిబ్బందికి ప్రమాద బీమా పాలసీ బాండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టణాన్ని మోడల్ సిటీగా సంగారెడ్డి తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు. మున్సిపల్ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య, తాగునీటి సరఫరా, ఎలక్ట్రికల్, ఆఫీస్‌కు సంబంధించి సుమారు 400 మందికి పైగా సిబ్బందికి ప్రమాద బీమా పాలసీల పంపిణీ చేశారు. అదే విధంగా రూ.40లక్షలతో ఐదు కొత్త ట్రాక్టర్లను కొనుగోలు చేసినట్లు తెలిపారు. కార్మికుల సంక్షేమానికి మున్సిపాలిటీ జనరల్ ఫండ్ ద్వారా రూ.10లక్షల ఇన్సూరెనన్స్ చేయించడం రాష్టంలోనే తొలిసారి అని, అందుకు కృషి చేసిన అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆధునిక పద్ధతులతో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతినెలా రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే ఔట్ సోర్సింగ్ సిబ్బంది 5వ తేదీలోగా జీతాల చెల్లింపు చేస్తున్నామన్నారు. అ లాగే కార్మికుల ఆరోగ్య రక్షణ కోసం మున్సిపల్ నుంచి ఇవ్వాల్సిన అన్ని రకాల వస్తువులు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మున్సిపల్ డీఈ రఘు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ సాజిద్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
కొత్త ట్రాక్టర్లను ప్రారంభిస్తున్న నిర్మలారెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య
మోడల్ సిటీగా సంగారెడ్డిని తీర్చిదిద్దుతాం
మున్సిపాలిటీకి కొత్తగా ఐదు ట్రాక్టర్లు
సిబ్బందికి ప్రమాద బీమా సౌకర్యం
టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలారెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య


