దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులేవి?
జహీరాబాద్: ఎమ్మెల్యే మాణిక్‌రావు సోమవారం అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించారు. భారీ వర్షాలకు రోడ్లన్నీ దెబ్బతిన్నా ఇప్పటి వరకు వాటిని మరమ్మతులు చేయించలేదన్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జహీరాబాద్ పర్యటనకు వచ్చిన సందర్భంగా పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ రోడ్లను మరమ్మతులు చేయించాలని విన్నవించినట్లు పేర్కొ న్నారు. అయినా ఇప్పటివరకు రోడ్ల మరమ్మతులు ప్రారంభించలేదన్నారు. వెంటనే దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయించి ప్రజలు, వాహన చోదకుల ఇబ్బందులను దూరం చేయాలని కోరారు. ఇదిలా ఉంటే ఝరాసంగం కేతకీ సంగమేశ్వర ఆలయానికి పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర భక్తులతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి అధికంగా వస్తున్నారని, దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆరు పడకల నుంచి 30 పడకల ఆస్పత్రిగా పెంచాలని కోరారు.
అసెంబ్లీలో ఎమ్మెల్యే మాణిక్‌రావు


