ముక్కోటికి ముస్తాబు
సంగారెడ్డి టౌన్: ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆలయాలు ముస్తాబయ్యాయి. మంగళవారం ఉదయం తెల్లవారుజాము నుంచి భక్తులకు దర్శనం కల్పించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సంగారెడ్డి పట్టణంలోని బాలాజీ దేవాలయం, పట్టణ శివారులోని వైకుంఠపురంలో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఆలయం చుట్టూ విద్యుత్ కాంతులతో అలంకరించారు. పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలను కేటాయించారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎస్పీ పరితోష్ పంకజ్ సోమవారం వైకుంఠపురం ఆలయం వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట డీఎస్పీ సత్తయ్యగౌడ్, టౌన్ సీఐ రామానాయుడు, ట్రాఫిక్ సీఐ రామకృష్ణారెడ్డి, ఆల య కమిటీ సభ్యులు ఉన్నారు.
విద్యుత్ కాంతుల్లో వైకుంఠపురం ఆలయం


