ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బైక్
ప్రమాదంలో వ్యక్తి మృతి
నర్సాపూర్ రూరల్: ట్రాక్టర్‌ను ఢీకొట్టి ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై రంజిత్ రెడ్డి వివరాల ప్రకారం.. శివంపేట మండలం పిల్లుట్ల గ్రామానికి చెందిన మస్కూరి గోపాల్ (43) ట్రాక్టర్ డ్రైవర్. రోజు లాగే సంగారెడ్డిలో ట్రాక్టర్ డ్రైవింగ్ డ్రైవింగ్ పనులు ముగించుకుని ఆదివారం సాయంత్రం బైక్‌పై తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో నర్సాపూర్ – వెల్దుర్తి రహదారిలోని బ్రాహ్మణపల్లి శివారులో ముందు వెళుతున్న ట్రాక్టర్‌ను వెనక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు..
మనోహరాబాద్(తూప్రాన్): రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందగా, ఇద్దరు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ సుభాష్‌గౌడ్ కథనం మేరకు... చేగుంట మండలంలోని చిన్న శివనూర్ గ్రామానికి చెందిన మల్లప్పగారి హేమంత్‌సాయి(21), మండలంలోని రామంతపూర్ శివారులో ఓ పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్నాడు. కాగా తనతోపాటు పని చేసే కుక్కదువ్వు ప్రవీణ్, మధ్యప్రదేశ్‌కు చెందిన కుల్ధీప్‌లతో కలిసి బైక్‌పై ఆదివారం రాత్రి 10 గంటలకు విధులు ముగిసిన తర్వాత మేడ్చల్‌కు పనినిమిత్తం వెళుతున్నారు. ఈ క్రమంలో అర్థరాత్రి మండలంలోని జీడిపల్లి శివారులోకి రాగానే జాతీయ రహదారిపై ముందు వెళుతున్న వాహనాన్ని ఢీకొట్టి రోడ్డుపై పడి పోయారు. ఈ ప్రమాదంలో హేమంత్‌సాయి అక్కడిక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన కుల్ధీప్, ప్రవీణ్‌లను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
చికిత్స పొందుతూ హెడ్ కానిస్టేబుల్..
చేర్యాల(సిద్దిపేట): రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. వివరాలు ఇలా... మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రానికి చెందిన పొన్నమల్ల నరేందర్(52) సిద్దిపేట జిల్లా కేంద్రంలో నివాసం ఉంటూ స్థానిక పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే రోజువారీగా విధులకు హాజరయ్యేందుకు ఈనెల 26న ద్విచక్ర వాహనంపై వస్తుండగా గుర్జకుంట వాగు బ్రిడ్జి వద్ద కుక్క అడ్డురావడంతో బైక్‌పై నుంచి కిందపడి గాయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.
ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బైక్


