గ్రామైక్య సంఘం సేవలు అభినందనీయం
హత్నూర (సంగారెడ్డి): నస్తీపూర్ గ్రామైక్య సంఘం మహిళలు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారని డీఆర్‌డీఏ పీడీ జ్యోతి అభినందించారు. మంగళవారం మండలంలోని నస్తీపూర్ మహిళా గ్రామైక్య సంఘం నూతన సంవత్సర క్యాలెండర్‌ను కలెక్టర్ కార్యాలయంలో ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ... పంచాయతీ తీర్మానం చేసి స్థలం చూపిస్తే సంఘం భవన నిర్మాణానికి రూ.10లక్షల ఉపాధి హామీ పథకంలో ఇస్తామన్నారు. కొంతకాలంగా ఆడపిల్ల పుడితే ఊరంతా సంబరంతో పాటు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న మహిళలందరినీ అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రమీల, ఉపసర్పంచ్ మహేందర్, అదనపు పీడీ సూర్యారావు, కార్యదర్శి మౌనిక, కోశాధికారి అక్షయ, ఏపీఎం రాజశేఖర్, సీసీలు సావిత్రి, మహేశ్, వీఓఏ ప్రవీణ్, మాజీ అధ్యక్షురాలు సువర్ణ, సుజాత, ఫీల్డ్ అసిస్టెంట్ సాయిలు, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.
డీఆర్‌డీఏ పీడీ జ్యోతి


