ఉత్తమ పాఠశాలగా ‘పీఎంశ్రీ జక్కాపూర్’
సిద్దిపేటరూరల్: మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠం, హైబిజ్ టీవీ సంయుక్తంగా అందజేస్తున్న ఉత్తమ పాఠశాల పురస్కారానికి జక్కాపూర్ ఉన్నత పాఠశాల ఎంపికై నట్లు ఆ పాఠశాల హెచ్‌ఎం కొమ్మూరి పద్మ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించే దిశగా ఈ అవార్డు అందజేస్తున్నారన్నారు. ఉత్తమ ఫలితాలు సాధిస్తూ విద్యార్థులను ఉన్నత స్థానాలకు ఎదిగే విధంగా ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయులను అభినందించారు. మంగళవారం హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠం డైరెక్టర్ ప్రీతిరెడ్డి, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నట్టు చెప్పారు. సర్పంచ్ భానుచందర్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మాట్ల లక్ష్మి, దొంతుల సుధాకర్, ఎన్నారై మోసర్ల మాధవరెడ్డి, మట్టె బాల్‌రెడ్డి, దుర్గం పరశురాములు ఉపాధ్యాయులను అభినందించారు.


