ప్రతిభ చాటి.. బహుమతులు గెలిచి..
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట)/హవేళిఘణాపూర్(మెదక్): బాల చెలిమి ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి బాలల కథల పోటీల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు సత్తా చాటినట్లు అక్షర సేద్యం ఫౌండేషన్ చైర్మన్ దుర్గయ్య తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని బాలచెలిమి కార్యాలయంలో ఉపాధ్యాయుడు వెంగళ నరేశ్, విద్యార్థి విశ్వతేజకు రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ రియాజ్ నగదు బహుమతి, ప్రశంసా పత్రం అందజేశారు. అలాగే మెదక్ జిల్లా హవేళిఘణాపూర్ జడ్పీ హైస్కూల్ విద్యార్థి గుగ్లోత్ పూజ రచించిన గోనె సంచి కథలు ఉత్తమ కథగా ఎంపికై నట్లు ఉపాధ్యాయుడు ఉండ్రాళ్ల రాజేశం తెలిపారు. కాగా ఆమెకు ప్రశంసాపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బాల చెలిమి సంపాదకులు మణికొండ వేదకుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ కార్యదర్శి డాక్టర్ రావి శారద, డాక్టర్ రఘు, బాల సాహితీవేత్త అశోక్, పత్తిపాక మోహన్ తదితరులు పాల్గొన్నారు.


