మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
చిన్నశంకరంపేట(మెదక్): మహిళలు అన్ని రంగాల్లో ధైర్యంగా ముందుకు సాగాలని శక్తి వాహిణి వ్యవస్థాపకురాలు, హైకోర్టు న్యాయవాది మౌనిక సుంకర కోరారు. ఆదివారం నార్సింగి మండల కేంద్రంలోని శ్రీసరస్వతి శిశుమందిర్‌లో నిర్వహించిన శ్రీ శక్తి సంఘం కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో తమ శక్తిని చాటాలన్నారు. ఇదే సమయంలో నైతిక విలువలతో కూడిన నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని కోరారు. విద్యార్థులు మహిళా సాధికారత, నైతిక విలువలు, సామాజిక బాధ్యతతో అన్ని రంగాల్లో ముందుకు రావాలన్నారు. శ్రీశక్తి మాతగా గుర్తిస్తున్న సమాజంలో అదే స్థాయిలో గౌరవం పొందేలా నైపుణ్యతను పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో కల్పన, నార్సింగి సర్పంచ్ సుజాత గౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సంఘం సభ్యులు పాల్గొన్నారు.
హైకోర్టు న్యాయవాది మౌనిక


