ప్రకృతి విలయాలను గుర్తించవచ్చు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జ్యోతిష్య శాస్త్రాల శ్లోకాలు నేటి సాంకేతికతకు ఎంతో దగ్గరగా ఉంటాయని హైదరాబాద్ జ్యోతిష్య పరిశోధన కేంద్రం వ్యవస్థాపకులు రవి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని గౌరీ నీలకంఠేశ్వర దేవాలయ ప్రాంగణంలో హైదరాబాద్ జ్యోతిష్య పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో ఆరవ జ్యోతిష్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భూకంపాలు, తుఫానులు వంటి ప్రకృతి విలయాలను జ్యోతిష్య సంహిత ద్వారా ముందుగానే గుర్తించవచ్చని తెలిపారు. సైన్స్ ఆధారంగా నిరూపించబడిన ఎన్నో విషయాలు జ్యోతిష్య సంహితలో వందల సంవత్సరాల క్రితమే పొందుపరచబడి ఉన్నాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి భానుమతి, జ్యోతిష్య పండితులు ఉమాపతి రామేశ్వర శర్మ, నీలకంఠ సమాజం అధ్యక్షుడు కడవేర్గు నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ జ్యోతిష్య పరిశోధన
కేంద్రం వ్యవస్థాపకుడు


