గురుకుల ప్రవేశాలకు దరఖాస్తులు
మిరుదొడ్డి(దుబ్బాక): గురుకులాల్లో 2026–27 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి నుంచి 9 వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అల్వాల–చెప్యాల క్రాస్ రోడ్డులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ రఘునందన్‌రావు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ జనవరి 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికై న విద్యార్థులకు ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం వరకు ఉచిత భోజన వసతితో పాటు, విద్యాబోధన అందిస్తామన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


