ఓడినా.. మాటకు కట్టుబడి..
శివ్వంపేట(నర్సాపూర్): సర్పంచ్ అభ్యర్థిగా ఓడిపోయినా.. కాలనీవాసులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని అందరితో శభాష్ అనిపించుకున్నాడు. మండల పరిధిలోని దొంతి గ్రామ పంచాయతీలో బీఆర్‌ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా సుశీల బాబుసుకుమార్ పోటీ చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో చింతల బస్తీలో నీటి ఎద్దడి ఉందని కాలనీవాసులు వారి దృష్టికి తీసుకొచ్చారు. కాగా జరిగిన ఎన్నికల్లో సుశీల బాబుసుకుమార్ ఓడిపోయినా ఇచ్చిన మాట ప్రకారం శనివారం రాత్రి చింతల్ బస్తీలో సొంత నిధులతో బోరుబావి తవ్వించారు. దీంతో పుష్కలంగా నీరు పడింది. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు లాయక్, శ్రీనివాస్, వార్డు సభ్యులు సుజాత, మమత, కృష్ణ, రాములు, స్వామి ఉన్నారు.
బోరుబావి తవ్వించిన అభ్యర్థి


