రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
సిద్దిపేటరూరల్: రిటైర్డ్ ఎంప్లాయీస్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లులు, సమస్యలను పరిష్కరించాలని ఆ సంఘం అసోసియేషన్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పొన్నమల్ల రాములు మాట్లాడుతూ... 2024 మార్చి నుంచి పెన్షన్, ఈపీఎఫ్, గ్రాట్యుటీ, గత పీఆర్సీ డీఏలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.


