వెనక్కి తగ్గేది లేదు
అమీన్పూర్లో ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బంది కలిగించే ఎస్‌టీపీ ఏర్పాటును వ్యతిరేకిస్తాం. పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఎస్‌టీపీని అడ్డుకుంటాం. స్థానిక కాలనీవాసులు ఇదే విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళితే రానివ్వబోమని హామీ ఇచ్చారు. ప్రశాంతమైన గుట్టల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనివ్వబోం. స్థానికుడిగా ఈ ప్రాంతం జీవవైవిధ్యం,, పర్యావరణాన్ని కాపాడే బాధ్యత నాపై ఉంది.
–తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్
అమీన్‌పూర్‌లోని సర్వే నంబర్ 993లో ఎస్‌టీపీ నిర్మాణం ఆక్షేపణీయం. స్థానిక కాలనీవాసులకు దాంతో ఎలాంటి లాభం లేదు. అక్కడ స్టేడియం నిర్మిస్తే పట్టణ పౌరులకు ఉపయోగకరంగా ఉంటుంది. అక్కడ ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులు కొనసాగాలి. ఎస్‌టీపీ ఏర్పాటు సరైంది కాదు.
–ఎం.రమేష్‌కుమార్, మోడీ కాలనీ మాజీ అధ్యక్షుడు
వెనక్కి తగ్గేది లేదు


