నడుచుకుంటూ వెళ్తుండగా..
హత్నూర( సంగారెడ్డి): ద్విచక్ర వాహనం ఢీకొని కార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని గుండ్ల మాచునూర్ గ్రామ శివారులో గురువారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు ఇలా... జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన హరే రామ్ సర్దార్ (44) కొంతకాలంగా కోవలెంట్ లేబరేటరీస్ పరిశ్రమలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రాత్రి పరిశ్రమ సమీపంలో సంగారెడ్డి నర్సాపూర్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో తోటి కార్మికులు వెంటనే సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించినట్లు ఎస్సై శ్రీధర్ రెడ్డి తెలిపారు.
రెండు బైకులు ఢీకొని వ్యక్తి..
నర్సాపూర్ రూరల్: రెండు బైకులు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం రాత్రి నర్సాపూర్ – మెదక్ జాతీయ రహదారిపై పెద్ద చింతకుంట సమీపంలో చోటు చేసుకుది. ఎస్సై రంజిత్ రెడ్డి వివరాల ప్రకారం... నర్సాపూర్‌కు చెందిన బంటారం భద్రప్ప (70) టీవీఎస్ మోటార్‌పై నర్సాపూర్ వైపు వస్తుండగా ఎదురుగా వచ్చిన పల్సర్ బైక్ ఢీకొట్టింది. దీంతో భద్రప్పకు తీవ్ర గాయాలు కాగా అంబులెనన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. అతడు మిర్చి బండి నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మృతునికి భార్య శంకరమ్మ ఉంది.
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు..
మరో ఘటనలో...
బైక్ ఢీకొని కార్మికుడు మృతి


