బీఆర్‌ఎస్‌లో పలువురి చేరిక
సిద్దిపేటఅర్బన్: మండలంలోని మిట్టపల్లి గ్రామానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే హరీశ్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆదివారం హైదరాబాద్‌లోని హరీశ్‌రావు తన నివాసంలో యువకులకు బీఆర్‌ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చింతల కుమార్ ఆధ్వర్యంలో పయ్యావుల రాజయ్య, పయ్యావుల కొమురయ్య, పయ్యావుల యాదగిరి, భైరి యాదగిరి, చింతల రాజు, జంపల్లి దేవరాజు, జక్కుల శివ, జిట్ట పరశురాములు, జిట్ట రాజు, బాకీ మల్లేశం, బంగారు కనకయ్య, జిట్ట కర్ణాకర్, బుట్టి ప్రభాకర్, తదితరులు పార్టీలో చేరారు.
కాంగ్రెస్ పార్టీలో..
మిట్టపల్లి, ఎల్లుపల్లి గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు మాజీ పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు. వీరికి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి హరికృష్ణ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎల్లుపల్లి నుంచి కనకయ్య, ఉప సర్పంచ్ పెద్ద నర్సయ్య, మాజీ సర్పంచ్ పోచయ్య, వార్డు సభ్యులు కమలాకర్‌రెడ్డి, బాపురాజు, నాయకులు నరసింహారెడ్డి, దుర్గారెడ్డి, మల్లారెడ్డి, కనకయ్య, భూమయ్య చేరారు. మిట్టపల్లికి చెందిన ఇసాక్, సతీశ్, ఉదయ్, బాల్‌నర్సింహులు పార్టీలో చేరారు.


