ప్రకృతిని పరిరక్షించాలి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ప్రకృతిని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కాకతీయ హైస్కూల్‌లో ఎన్‌జీసీ (నేషనల్ గ్రీన్ కార్ప్) ఆధ్వర్యంలో వేస్టేజ్ టూ యూజ్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డీఈవో ప్రారంభించారు. విద్యార్థులు తయారుచేసిన పేపర్ బ్యాగులు, పర్యావరణ కాలుష్యం కాకుండా తయారు చేసిన రాకెట్, వెండ్ చైన్, బెడ్ లాంప్, రూల్స్, మెజర్మెంట్ పార్క్ ఏరియా, తులసి కుండి, మ్యూజికల్ గిటార్, వాటర్ క్లీనర్, బ్యాగ్‌లు వివిధ రకాల వస్తువులను ప్రదర్శించారు. ఉత్తమ ఎగ్జిబిట్స్ తయారు చేసిన విద్యార్థులను ప్రశంసించి, సర్టిఫికెట్లు అందించారు. కార్యక్రమంలో ఎంఈవో ప్రభాకర్‌రెడ్డి, ఎన్జీసీ కోఆర్డినేటర్ రాజశేఖర్, పవన్ కుమార్, పాఠశాల కరస్పాండెంట్ మల్లారెడ్డి, ప్రిన్సిపాల్ కవిత, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి


