ఈనెల 24న జాబ్ మేళా
సంగారెడ్డి టౌన్: జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ఈ నెల 24న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి కల్పన అధికారి నిర్మల ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐలో ఉత్తీర్ణత సాధించిన యువకులు మిషన్ ఆపరేటర్‌గా పని చేసేందుకు ఎవరెస్ట్ ఆర్గానిక్ కంపెనీలో ఆసక్తి కలిగిన వారు పూర్తి సర్టిఫికెట్లతో జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో హాజరుకావాలని పేర్కొన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వట్‌పల్లి(అందోల్): అందోల్ మండల పరిధిలోని కన్‌సాన్‌పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 114 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాలలో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై ఈనెల 22న ‘114 మంది విద్యార్థులు.. ఒకే మరుగుదొడ్డి’ అనే శీర్షికతో సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించారు. అందోల్ ఎంఈఓ బి.కృష్ణకు ఫోన్‌చేసి పాఠశాలలో టాయిలెట్లు, మరుగుదొడ్ల ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. వెంటనే నివేదికను అందజేయాలని ఆదేశించినట్లు తెలిసింది.
పటాన్‌చెరు: అమీన్‌పూర్‌లో ఇండస్‌ర్యాలీ కాలనీలో పార్కు స్థలాన్ని కబ్జా చెర నుంచి హైడ్రా అధికారులు విడిపించారు. కాలనీవాసులు ఫిర్యాదు మేరకు అధికారులు సోమవారం ఈ చర్యలు తీసుకున్నారు. కాలనీ సంఘం ప్రతినిధి వజ్రాల కోటిరెడ్డి మాట్లాడుతూ.. 2005లో వెంచర్ ఏర్పడిందని ఇటీవల భూ యజమాని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి పార్కు స్థలాన్ని ప్లాట్లుగా చేసి విక్రయించారని స్థానికులు ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు పార్కు జాగాలో నిర్మించిన నిర్మాణాలను తొలగించారు.
ఎమ్మెల్యే సంజీవరెడ్డి
కల్హేర్: గ్రామాల అభివృద్ధికి నూతన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు సమష్టిగా కృషి చేసి గ్రామాలను ప్రగతి పథంలో తీసుకెళ్లాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి కోరారు. సోమవారం కల్హేర్ మండలం కృష్ణాపూర్, బీబీపేట, మార్డి గ్రామాల్లో నూతన సర్పంచ్‌లు ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొని మాట్లాడారు. పల్లె ప్రగతితోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. రాజకీయాలకతీతంగా అభివృద్ధి పనులు చేపడుతానని చెప్పారు. నర్సాపూర్‌లో జరిగిన ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడి డిమాండ్
జోగిపేట(అందోల్): విద్యార్థుల స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎర్రోళ్ల మహేశ్ డిమాండ్ చేశారు. సోమవారం జోగిపేట కురుమ సంఘం ఆవరణలో అందోల్ డివిజన్ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినా.. స్కాలర్‌షిప్‌లు విడుదల చేయడంలో నిర్లక్ష్యం చూపుతుందన్నారు. దీంతో విద్యార్థులు రుణాల్లో చిక్కుకుని, చదువు మధ్యలోనే నిలిపివేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. తక్షణమే స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలన్నారు.
నూతన కమిటీ..
ఎస్‌ఎఫ్‌ఐ అందోల్ డివిజన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్ష కార్యదర్శులుగా బి.నిఖిల్ , కే.బుచ్చిబాబు ఉపాధ్యక్షులుగా కిశోర్, ఎన్.వైష్ణవి, కే.కీర్తన, కే.మీనాక్షి, సహాయ కార్యదర్శిగా దుర్గావరప్రసాద్, కే.కిశోర్, ఎం.మధు, కమిటీ సభ్యులుగా పలువురిని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ప్రభాకర్ పాల్గొన్నారు.
ఈనెల 24న జాబ్ మేళా
ఈనెల 24న జాబ్ మేళా


