స్వీయరక్షణకు ‘కలరిపట్టు’ | - | Sakshi
Sakshi News home page

స్వీయరక్షణకు ‘కలరిపట్టు’

Dec 29 2025 10:52 AM | Updated on Dec 29 2025 10:52 AM

స్వీయరక్షణకు ‘కలరిపట్టు’

స్వీయరక్షణకు ‘కలరిపట్టు’

గజ్వేల్‌రూరల్‌ : స్వీయరక్షణకు కలరీపట్టు ఎంతో దోహదం చేస్తుందని శివలింగు శ్రావణి, ఆంజనేయులు పేర్కొన్నారు. వరల్డ్‌ కలరీపట్టు ఫెడరేషన్‌ సహకారంతో కేరళకు చెందిన సీవీవీ కలరీ సంఘం ఫౌండర్‌ డాక్టర్‌ కృష్ణో ఆధ్వర్యంలో గజ్వేల్‌ పట్టణంలోని ఓ గార్డెన్‌లో కలరిపట్టుపై రెండ్రోజుల పాటు శిక్షణనిచ్చారు. ఈ శిక్షణకు గజ్వేల్‌, వరంగల్‌, సూర్యాపేట, వికారాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ నుంచి , ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం తదితర జిల్లాల నుంచి సుమారు 20 మంది శిక్షణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు శ్రావణి, ఆంజనేయులులు మాట్లాడుతూ... స్వీయరక్షణకు కలరిపట్టు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. భారతీయ ప్రాచీన కళలను భవిష్యత్‌ తరాలకు తెలియజేయడంలో భాగంగానే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. అతి ప్రాచీనమైన కలరిపట్టును నేర్చుకొని ఈ ప్రాంత విద్యార్థులకు దాని ప్రాముఖ్యతను తెలియజేయడంతో పాటు ఆసక్తిగల వారికి నేర్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అఫీషియల్‌ ట్రైనర్‌ ఉమేశ్‌ గురుకుల్‌, ఎగ్జామినర్‌ సబితాగురుకుల్‌తో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన శిక్షణార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement