జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మానిటరింగ్ క
సంగారెడ్డి: మద్యాన్ని అరికట్టడానికి బదులు ఎకై ్సజ్ శాఖలో బెల్ట్ షాపుల అమ్మకాన్ని ప్రోత్సహించిన సీఐ సాగర్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలె న్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కాశపాగ ఇమ్మయ్య డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని గ్రామాల్లో బెల్ట్ షాపులు మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తున్నాయని, ఈ వ్యాపారంలో దాన్ని అరికట్టవలసిన అదే శాఖకు చెందిన ఒక ఉన్నత అధికారి బెల్ట్ షాపులని ప్రోత్సహస్తూ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. దీన్ని బట్టి ఆయనకు సదరు షాపుల నుంచి మామూళ్లు వెళ్తున్నాయని ఆరోపించారు. గ్రామాల్లో తాగుడు వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నా.. వీరికి పట్టదా అని ప్రశ్నించారు. తక్షణమే గ్రామాల్లో నడుస్తున్న బెల్ట్ షాప్‌లపై చర్యలు తీసుకొని అమాయక ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు. ఎంఆర్‌పీఎస్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి పల్లె కిష్టయ్య మాట్లాడుతూ.. గ్రామాల్లో మత్తు పదార్థాలను వాడి తయారు చేసిన కల్లును ప్రజలకు తాపీ అనారోగ్యలకు గురి చేస్తున్న బడా వ్యాపారులకు తొత్తుగా పని చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఫ్రెండ్స్ యూత్ వ్యవస్థాపక అధ్యక్షుడు పొట్టిగాళ్ల మోహన్ తదితరులు పాల్గొన్నారు.


