అథ్లెటిక్స్‌లో ప్రభాకర్‌కు రెండో స్థానం
పాపన్నపేట(మెదక్): మండలంలోని ఎల్లాపూర్‌కు చెందిన ప్రభాకర్ గౌడ్ కరీంనగర్‌లో శనివారం జరిగిన 12వ రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో రెండో స్థానాన్ని పొందాడు. మెదక్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ప్రభాకర్ గౌడ్ చిన్నప్పటి నుంచి క్రీడల్లో ప్రతిభ కనబరిచేవారు. ఈ మేరకు కరీంనగర్‌లో జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని విజయం సాధించాడు. మెదక్ పోలీసులు , గ్రామస్తులు ఆయనను ప్రశంసించారు.
యువతి అదృశ్యం
ఝరాసంగం(జహీరాబాద్): ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి అదృశ్యమైంది. ఈ సంఘటన మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం... జునేగావ్ గ్రామానికి చెందిన రేణుక(19) ఈనెల 26న ఇంట్లో ఎవరికి సమాచారం ఇవ్వకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేదు. దీంతో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మూడిళ్లలో చోరీ
నర్సాపూర్ రూరల్: తాళం వేసిన మూడిళ్లలో దొంగలు చొరబడి నగదు బంగారం ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మండలంలో చోటు చేసుకుంది. నర్సాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డి కథనం ప్రకారం... సునీత రెడ్డి కాలనీకి చెందిన షౌకత్ శుక్రవారం సాయంత్రం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో వేరే గ్రామానికి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన దొంగలు తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి, బీరువాలో ఉన్న రూ.11వేల నగదు, రెండున్నర గ్రాముల బంగారం ఎత్తుకెళ్లారు. అలాగే సీఎస్‌ఐ చర్చి సమీపంలో నివాసముంటున్న లంబాడి అనిత ఇంట్లో దొంగలు పడి రెండున్నర తులాల బంగారం ఎత్తుకెళ్లారు. మరోచోట జీకే మొబైల్ గల్లీలో నివాసముంటున్న మరాఠీ అవినాష్ ఇంట్లో చొరబడి రూ.5 వేల నగదును ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కాలువ దారి కబ్జాకు యత్నం
జిన్నారం (పటాన్‌చెరు): గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని సరాక పరిశ్రమ సమీపంలో గల కాలువ కబ్జాకు గురవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి, పరిశ్రమకు మధ్యలో ఉన్న కాలువ నుంచి వర్షం నీరు ప్రవహించేదని, కానీ టోటల్ ట్రిక్స్ పరిశ్రమ యాజమాన్యం కాలువ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. కబ్జాకు గురైతే దారి కూడా లేకుండా పోతుందని పరిశ్రమ యజమాన్యంపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
అథ్లెటిక్స్‌లో ప్రభాకర్‌కు రెండో స్థానం
అథ్లెటిక్స్‌లో ప్రభాకర్‌కు రెండో స్థానం


