మల్కాపూర్ అభివృద్ధిపై ఆరా..
తూప్రాన్: మండలంలోని మల్కాపూర్ ఆదర్శ గ్రామాన్ని సోమవారం బీహార్ రాష్ట్రానికి చెందిన 60 మంది గ్రూప్‌వన్ అధికారుల బృందం సందర్శించింది. ఎన్‌ఐఆర్‌డీలో శిక్షణ పొందిన అధికారుల బృందం ఐదు రోజులపాటు క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మల్కాపూర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో డంపింగ్ యార్డ్, రాక్ గార్డెన్, వివిధ భవన సముదాయాలను పరిశీలించారు. ఒకప్పుడు మారుమూల గ్రామంగా ఉన్న మల్కాపూర్ అనతి కాలంలోనే అభివృద్ధి సాధించిన తీరును మేకిన్ యువత బృందం సభ్యులకు వివరించారు. ఈ సదర్భంగా వారు గ్రామస్తులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆంజనేయులుగౌడ్, ఎంపీఓ సతీశ్ కుమార్, ఉప సర్పంచ్ స్వామి, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, మేకిన్ యువత, గ్రామస్తులు పాల్గొన్నారు.
గ్రామంలో బీహార్ అధికారుల పర్యటన


